యశస్వి రెండో డబుల్ సెంచరీ.. దిగ్గజాల సరసన జైస్వాల్
ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ (214) బాదాడు.
ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ (214) బాదాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లోనూ యశస్వి డబుల్ సెంచీర చేశాడు. వరుసగా రెండు టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో దిగ్గజాల సరసన చేరాడు.
ఇప్పటి వరకు ఏడుగురికే రికార్డు
దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన టెస్ట్ క్రికెట్‌లో వరుసగా రెండు టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు ఏడుగురే ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ వాలీ హేమండ్స్, ఆస్ట్రేలియా ఆటగాడు, ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్, ఇండియన్ ప్లేయర్ వినోద్ కాంబ్లీ, శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత సాధించారు. యశస్వి జైస్వాల్ ఇప్పుడు వరుస డబుల్ సెంచరీలతో వీరి సరసన చేరాడు.
ఏడు టెస్ట్‌ల్లోనే రికార్డుల మోత
పేదరికం నేపథ్యం నుంచి టీమిండియా వరకు వచ్చిన యశస్వి జైస్వాల్ తన ధనాధన్ ఆటతీరుతో ఐపీఎల్‌లో స్టార్ ఎట్రాక్షన్. ఇప్పుడు ఇండియన్ టెస్ట్ టీమ్‌లోకి రావడమే కాదు ఏడు మ్యాచ్‌ల్లోనే రెండు డబల్ సెంచరీలతో రికార్డుల మోత మోగించడం విశేషం.