గల్ఫ్ గడ్డపై రేపటినుంచే ప్రపంచకప్ ఫుట్ బాల్ సంబరం!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడోత్సవం 2022- పిఫా ప్రపంచకప్ సంరంభానికి గల్ఫ్ లోని అతిచిన్న దేశం ఖతర్ ఆతిథ్యమిస్తోంది. నెలరోజులపాటు జరిగే ఈ సాకర్ ప్రపంచ సంగ్రామంలో 32 దేశాలకు చెందిన జట్లు ఢీకొనబోతున్నాయి.

Advertisement
Update:2022-11-19 15:49 IST

గల్ఫ్ గడ్డపై రేపటినుంచే ప్రపంచకప్ ఫుట్ బాల్ సంబరం!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడాసంబరం ప్రపంచకప్ ఫుట్ బాల్ కు ..ప్రపంచంలోనే అతిచిన్న దేశాలలో ఒకటైన ఖతర్ వేదికగా నిలిచింది. నవంబర్ 20 నుంచి నెలరోజులపాటు జరిగే 32 జట్ల ఈ సంరంభాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాదిమంది వీక్షించనున్నారు...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడోత్సవం 2022- పిఫా ప్రపంచకప్ సంరంభానికి గల్ఫ్ లోని అతిచిన్న దేశం ఖతర్ ఆతిథ్యమిస్తోంది. నెలరోజులపాటు జరిగే ఈ సాకర్ ప్రపంచ సంగ్రామంలో 32 దేశాలకు చెందిన జట్లు ఢీకొనబోతున్నాయి.

ఈ పోటీల నిర్వహణ కోసం ఖతర్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తోంది. 32 జట్లు తలపడే గ్రూపు్ లీగ్ పోటీల కోసం మొత్తం 7 అత్యాధునిక ఫుట్ బాల్ స్టేడియాలను వెయ్యికోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో నిర్మించి సిద్ధం చేసింది.

ఖతర్ రాజధాని దోహా నగరంలోనే సాకర్ వేదికలన్నీ ముస్తాబయ్యాయి. పోటీల కోసం మెట్రో రైల్ నెట్ వర్క్ ను సైతం ఏర్పాటు చేశారు.

అరబ్ నేలపై తొలిసారిగా...

ఇప్పటి వరకూ యూరోప్, అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాఖండ దేశాల గడ్డపైన జరిగిన ప్రపంచకప్ సాకర్ పోటీలు చరిత్రలోనే తొలిసారిగా అరబ్ నేల పై జరుగనున్నాయి.

ఆరువారాలపాటు సాగే ఈ టో్ర్నీ ప్రారంభమ్యాచ్ లో ఈక్వెడోర్ తో ఆతిథ్య ఖతర్ జట్టు తలపడనుంది.

పట్టుమని 30 లక్షల జనాభా కూడా లేని ఖతర్ ఫుట్ బాల్ వేదికల కోసమే 6.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సాకర్ మౌలిక సదుపాయాల కోసమే ఖతర్ ప్రభుత్వం 200 బిలియన్ డాలర్లు వ్యయం చేసింది.

భగభగ మండే ఎండవేడిలో ప్రపంచకప్..

ఎడారిదేశం ఖతర్ లోని నిప్పులు చెరిగే ఎండవేడిమి వాతావరణంలో ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు జరుగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 10 లక్షల మంది సాకర్ అభిమానులు ఈ బుల్లిదేశానికి తరలి వస్తున్నారు. ఖతర్ లో ఇంతమందికి తగిన హోటల్ సదుపాయాలు లేకపోడంతో...క్రూయిజీ నౌకల్లోని ఫ్లోటింగ్ హోటెల్స్ లో విడిది ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మూడు క్రూయిజ్ లైనర్లను అందుబాటులో ఉంచారు.

31 లక్షల టికెట్లు....

ప్రపంచకప్ సాకర్ మ్యాచ్ ల కోసం నిర్వాహక సంఘం 31 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచితే ఇప్పటికే 29 లక్షల టికెట్లు విక్రయమైనట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

ఐదుసార్లు విజేత బ్రెజిల్, మాజీ చాంపియన్లు అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్, డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తో సహా మొత్తం 32 దేశాలకు చెందిన జట్లు ట్రోఫీకి గురిపెట్టాయి.

మొత్తం 32 జట్లను ఎనిమిదిగ్రూపులుగా విభజించి తొలిదశ పోటీలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 20 నుంచి మూడువారాలపాటు ప్రపంచ సాకర్ అభిమానులకు పసందైన ఫుట్ బాల్ విందే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News