రో' హిట్' సెంచరీతో దిగ్గజాల రికార్డులు గల్లంతు!

వన్డే ప్రపంచకప్ రెండోరౌండ్ మ్యాచ్ లోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ సునామీ శతకం సాధించాడు. ఒక్క సెంచరీతో ఐదుగురి దిగ్గజాల రికార్డులను గల్లంతు చేశాడు..

Advertisement
Update: 2023-10-12 03:01 GMT

రో' హిట్' సెంచరీతో దిగ్గజాల రికార్డులు గల్లంతు!

వన్డే ప్రపంచకప్ రెండోరౌండ్ మ్యాచ్ లోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ సునామీ శతకం సాధించాడు. ఒక్క సెంచరీతో ఐదుగురి దిగ్గజాల రికార్డులను గల్లంతు చేశాడు..

ప్రపంచకప్ అనగానే రెచ్చిపోయే ఆడే భారత కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి చెలరేగిపోయాడు. భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ రెండోమ్యాచ్ లోనూ ధూమ్ ధామ్ శతకం బాదాడు..

కపిల్, సచిన్, గేల్, దాదాలను అధిగమించిన రోహిత్..

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్ఘనిస్థాన్ తో జరిగిన రెండోరౌండ్ పోరులో రోహిత్ పూనకంగా వచ్చినట్లుగా ఆడి సునామీ సెంచరీ సాధించాడు. వన్డే ప్రపంచకప్ లో తన 7వ సెంచరీ సాధించడం ద్వారా మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 6 శతకాల రికార్డును తెరమరుగు చేశాడు.

ఆస్ట్ర్రేలియాతో జరిగిన ప్రారంభమ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన రోహిత్ అప్ఘన్ పేస్, స్పిన్ బౌలింగ్ ఎటాక్ ను దనుమాడాడు. గ్రౌండ్ నలుమూలలకూ తన ట్రేడ్ మార్క్ పుల్, హుక్, లాఫ్టెడ్ షాట్లతో వీరవిహారం చేశాడు.

63 బంతుల్లోనే మెరుపు శతకం...

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతితక్కువ బంతుల్లో ( 72) శతకం బాదిన భారత క్రికెటర్ రికార్డు 1983 ప్రపంచకప్ నుంచి కపిల్ దేవ్ పేరుతో ఉంటూ వచ్చింది.

జింబాబ్వే పై 1983 జూన్ 18న అలనాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ 175 పరుగుల స్కోరు సాధించిన సమయంలో 72 బంతుల శతకం నమోదు చేశాడు. ఆ రికార్డును నాలుగు దశాబ్దాల విరామం తర్వాత రోహిత్ అధిగమించగలిగాడు.

273 పరుగుల విజయలక్ష్యంతో భారత్ చేజింగ్ కు దిగిన సమయంలో రోహిత్ మెరుపులు మెరిపించాడు. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, పవర్ ప్లే ఓవర్లు ముగియక ముందే 80 పరుగుల స్కోరును చేరుకోడం విశేషం.

554వ సిక్సర్లతో గేల్ ను మించిన రోహిత్..

క్రికెట్ మూడు ఫార్మాట్లలోను అత్యధిక సిక్సర్లు ( 553 ) బాదిన వెస్టిండీస్ సునామీ ఓపెనర్ గేల్ రికార్డును రోహిత్ తన 554వ సిక్సర్ బాదటం ద్వారా మరో రికార్డు సొంతం చేసుకొన్నాడు.రోహిత్ సెంచరీలో 5 సిక్సర్లు, 16 ఫోర్లు ఉన్నాయి. చివరకు రోహిత్ 131 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

1000 పరుగుల భారత 4వ క్రికెటర్...

వన్డే ప్రపంచకప్ లో వెయ్యి పరుగుల రికార్డు అందుకొన్న నాలుగో భారత క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. తన కెరియర్ లో 3వ ప్రపంచకప్ ఆడుతున్న రోహిత్ 1000 పరుగుల్లో 7 శతకాలు ఉన్నాయి. అంతేకాదు..ప్రపంచకప్ లో అత్యధిక స్కోర్లు సాధించిన బ్యాటర్ల వరుసలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సైతం తెరమరుగు చేయగలిగాడు.

సచిన్ రికార్డుకూ తప్పని ఎసరు...

గత రెండు దశాబ్దాలుగా మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న అత్యధిక ప్రపంచకప్ శతకాల (6) రికార్డుకు సైతం రోహిత్ ఎసరు పెట్టాడు. మాస్టర్ సచిన్ 1992 నుంచి 2011 ప్రపంచకప్ వరకూ 45 మ్యాచ్ లు ఆడి 41 ఇన్నింగ్స్ లో ఆరు శతకాలు బాదితే...రోహిత్ శర్మ మాత్రం 2015 ప్రపంచకప్ నుంచి 2023 ప్రపంచకప్ రెండోరౌండ్ మ్యాచ్ వరకూ కేవలం 19 ఇన్నింగ్స్ లోనే 7 శతకాలు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 2015 ప్రపంచకప్ లోనే రోహిత్ 5 శతకాలు బాదడం ద్వారా గతంలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు బాదిన ఒకే ఒక్కడు రోహిత్ శర్మ మాత్రమే.

ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా మాజీకెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉన్న 30 శతకాల రికార్డును సైతం రోహిత్ 31 సెంచరీతో అధిగమించాడు.

ఒక్క సెంచరీతో మాస్టర్ సచిన్, బ్లాస్టర్ గేల్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్, దాదా సౌరవ్ గంగూలీ, కంగారూ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ల రికార్డులను గల్లంతు చేయడం ద్వారా రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వన్డే క్రికెట్లో రోహిత్ కు ఇది 31వ శతకం కావడం మరో రికార్డు.

Tags:    
Advertisement

Similar News