409 మంది ప్లేయర్లతో నేడు మహిళా ఐపీఎల్ వేలం!
మొట్టమొదటి మహిళా ఐపీఎల్ వేలానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. ఈ రోజు జరిగే వేలం కార్యక్రమాన్ని మల్లికా అద్వానీ నిర్వహించనుంది. మొత్తం 409 మంది ప్లేయర్లతో వేలం నిర్వహించనున్నారు.
మొట్టమొదటి మహిళా ఐపీఎల్ వేలానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. ఈ రోజు జరిగే వేలం కార్యక్రమాన్ని మల్లికా అద్వానీ నిర్వహించనుంది. మొత్తం 409 మంది ప్లేయర్లతో వేలం నిర్వహించనున్నారు...
భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘట్టానికి ఈరోజు ముంబైలో తెరలేవనుంది. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు మహిళల కోసం తొలిసారిగా నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలిఅంచెలో భాగంగా వేలం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముంబైలో ఏర్పాట్లు చేశారు.
వేలం బరిలో 409 మంది ప్లేయర్లు..
డబ్ల్యూపీఎల్ వేలంలో దేశవిదేశాలకు చెందిన మొత్తం 409 మంది ప్లేయర్లతో రంగం సిద్ధమైంది. ఇందులో 246 మంది భారత క్రికెటర్లు, మిగిలిన 163 మంది వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు. మొత్తం 409 మంది ప్లేయర్లలో 202 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు, 199 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం ఐదు జట్లలో 90 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ 12 కోట్ల రూపాయలతో వేలం బరిలో నిలువనున్నాయి.
రూ.50 లక్షల కేటగిరీలో 24 మంది ప్లేయర్లు ఉండగా, రూ.40 లక్షల విభాగంలో 30 మంది ఉన్నారు.భారత కెప్టెనన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందన, షెఫాలీవర్మ, దీప్తిశర్మ, స్నేహ్‌రానా, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు అలీస్సా హిలీ, ఎకల్‌స్టోన్, నాట్ స్కీవర్, మెగ్ లానింగ్ ఉన్నారు.
వేలం జాబితాలో చోటు సంపాదించిన మొత్తం 409 మంది పేర్లను బీసీసీఐ అధికారికంగా బయటపెట్టింది.వీరిలో భారత క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నారు. జాతీయ జట్టుకు ఆడినవారు 202 మంది కాగా, దేశవాళీ క్రికెటర్లు 199 మంది, సంయుక్త దేశాలకు చెందిన 8 మంది ఈ వేలానికి ఎంపికయ్యారు.
మధ్యాహ్నం 2-30 నుంచి వేలం...
ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2-30 గంటలకు వేలం ప్రారంభంకానుంది. ఐదు ఫ్రాంచైజీలకు చెందిన జట్లలో మొత్తం 90 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 30 స్లాట్స్‌ను విదేశీ క్రికెటర్లకు కేటాయించారు. బీసీసీఐ మొదటిసారిగా నిర్వహిస్తున్న టోర్నీ కావడంతో 1,525 మంది ప్లేయర్స్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే.. చివరకు 409 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు.
అత్యధిక ధర ఎవరికంటే..?
వేలంలో పాల్గొంటున్న వాళ్లలో 24 మంది రూ. 50 లక్షల కనీస ధరకు ఎంపికయ్యారు. 30 మంది ప్లేయర్స్ రూ.40 లక్షల బేస్ ప్రైజ్‌కు పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. రూ. 50 లక్షల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శర్మ, షఫాలీ వర్మ వంటి భారత క్రికెటర్లు ఉన్నారు. 13 మంది విదేశీ క్రికెటర్లు కూడా రూ.50 లక్షలకు తమ పేరు రిజిష్టర్ చేసుకున్నారు. వాళ్లు ఎవరంటే.. ఎల్లిసే పెర్రీ(ఆస్ట్రేలియా) , సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), సోఫీ డెవినె (న్యూజిలాండ్), డియాండ్ర డొటిన్ (వెస్టిండీస్).
భారత స్టార్ ప్లేయర్లలో స్మృతి మంధానా, హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మలతో పాటు పలువురు విదేశీ క్రికెటర్లకు కోటి రూపాయల ధర పలికే అవకాశం ఉంది.
మల్లికా అద్వాని అరుదైన ఘనత...
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళా ఐపీఎల్ వేలాన్ని ఓ మహిళతోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఇంతకు ఈ వేలాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసా..? మల్లికా అద్వానీ అనే మహిళ. దాంతో, డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహించిన తొలి మహిళగా మల్లికాకు గుర్తింపు సాధించనుంది. ముంబైకి చెందిన మల్లికాకు పురాతన పెయింటింగ్స్, శిల్పాలను సేకరించడమంటే చాలా ఇష్టం. మధ్య భారతదేశం, ఆధునిక భారత దేశానికి సంబంధించిన పెయింటింగ్స్‌ను మల్లిక అధికంగా సేకరిస్తూ వచ్చింది. ఆమె ప్రస్తుతం ఆర్ట్ ఇండియా కన్సల్టంట్స్ కంపెనీలో పనిచేస్తోంది.
మార్చి 4 నుంచి మహిళా ఐపీఎల్...
ముంబై వేదికగా మర్చి 4న మహిళల ప్రీమియర్ లీగ్ మొదలు కానుంది. ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడతాయి. మార్చి 22న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తలపడనున్న జట్లలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఉన్నాయి.