ట్విట్టర్ ట్రెండింగ్: వి మిస్ యూ ధోనీ.. బాయ్ కాట్ ఐపీఎల్..!

కెప్టెన్ గా ధోని అందించిన విజయాలను గుర్తు చేసుకుంటూ వి మిస్ యూ ధోనీ.. అని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ధోని సారథ్యంలో టీమిండియా 2007లో ఐసీసీ టీ-20 ప్రపంచ కప్, 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీల్లో గెలుపొందింది.

Advertisement
Update:2022-09-08 18:12 IST

ట్విట్టర్‌లో ఇప్పుడు బాయ్ కాట్ ఐపీఎల్.. అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది. క్రీడా అభిమానులు అందరూ భారత మాజీ కెప్టెన్ ధోనీని గుర్తు చేసుకుంటూ వి మిస్ యూ ధోని.. అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఐపీఎల్ ను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం ఆసియా కప్ లో టీమిండియా ఘోరంగా విఫలం కావడమే. ఆసియా కప్ లో ఆరంభ మ్యాచ్ లలో అద్భుతంగా రాణించిన భారత జట్టు కీలకమైన సూపర్ ఫోర్ లో వరుసగా పాకిస్తాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లలో పరాజయం పాలై ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది.

జట్టు ఎంపిక సరిగా లేకపోవడం, సులువైన క్యాచ్ లను కీపర్ రిషబ్ పంత్ వదలివేయడం, మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ నియంత్రణ కోల్పోయి సహచర ఆటగాళ్లపై కోపం ప్రదర్శించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా క్రీడాభిమానులు ధోనీని గుర్తు చేసుకుంటున్నారు. మ్యాచ్ జరిగేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ధోనీ నియంత్రణ కోల్పోయే వాడు కాదని, పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే వాడని, రన్ ఔట్లు చేయడంలో ఎంతో కీలకంగా వ్యవహరించే వాడని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

కెప్టెన్ గా ధోని అందించిన విజయాలను గుర్తు చేసుకుంటూ వి మిస్ యూ ధోనీ.. అని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ధోని సారథ్యంలో టీమిండియా 2007లో ఐసీసీ టీ-20 ప్రపంచ కప్, 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీల్లో గెలుపొందింది.

విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తరువాత ఒక్కసారి కూడా టీమిండియా ఐసీసీ నిర్వహించిన టోర్నీలలో రాణించలేదు. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో ఆసియా కప్ లో కూడా విఫలం కావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ లో రూ. వందల కోట్లు ఆర్జిస్తున్న ఆటగాళ్లు ఆ ఆటకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్న వారు భారత జట్టు తరఫున ఆడటం లేదని క్రీడాభిమానులు విమర్శిస్తున్నారు. టీమిండియా తరఫున ఆటగాళ్లు రాణించాలంటే ముందుగా ఐపీఎల్ ను బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News