1205 రోజుల తర్వాత విరాట్ టెస్ట్ సెంచరీ!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 1205 రోజుల విరామం తర్వాత టెస్ట్ శతకాన్ని నమోదు చేసి..తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 75కు పెంచుకొన్నాడు.

Advertisement
Update:2023-03-12 15:59 IST

విరాట్ కొహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 1205 రోజుల విరామం తర్వాత టెస్ట్ శతకాన్ని నమోదు చేసి..తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 75కు పెంచుకొన్నాడు.....

భారత క్రికెట్ నయా రన్ మెషీన్ విరాట్ కొహ్లీని గత మూడేళ్లుగా వెంటాడుతున్న సెంచరీల లేమి ఎట్టకేలకు వీడింది. 2019లో చివరిసారిగా శతకం బాదిన విరాట్ ఆ తర్వాత క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీల లేమితో విలవిలలాడాడు.

దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ లో టీ-20 శతకం, బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో సెంచరీ బాదడంతో తిరిగి గాడిలో పడిన విరాట్..సాంప్రదాయ టెస్టు క్రికెట్లో శతకం కోసం మరికొద్దిమాసాలపాటు వేచిచూడాల్సి వచ్చింది.

అహ్మదాబాద్ లో శతకోదయం!

గతేడాది జరిగిన టెస్టు సిరీస్ లతో పాటు..ప్రస్తుత 2023 సీజన్ సిరీస్ ల్లో భాగంగా బంగ్లాదేశ్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లో సైతం విరాట్ విఫలమయ్యాడు.

ప్రస్తుత బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లోనూ విరాట్ మూడంకెల స్కోరు సాధించలేకపోయాడు. అయితే..అహ్మదాబాద్ మోతేరా స్టేడియం వేదికగా జరుగుతున్న ఆఖరిటెస్టులో మాత్రం విరాట్ సూపర్ సెంచరీ సాధించడం ద్వారా 1205రోజుల శతకనిరీక్షణకు తెరదించాడు.

అహ్మదాబాద్ టెస్ట్ నాలుగోరోజుఆట లో విరాట్ తన 28వ శతకాన్ని పూర్తి చేయగలిగాడు.

2019 నవంబర్ 22న బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా తన చిట్టచివరి టెస్ట్ సెంచరీ సాధించిన విరాట్..ఆ తర్వాత మరో శతకం బాదడం కోసం 2023 మార్చి 12వ తేదీ వరకూ వేచిచూడక తప్పలేదు.

ఎక్కడలేని ఓపికతో, ఓర్పునేర్పులు కలగలిపి ఆడటం ద్వారా మొత్తం 241 బంతులు ఎదుర్కొన్న విరాట్ 10 బౌండ్రీలతో సెంచరీని పూర్తి చేయగలిగాడు.

గత 14మాసాలుగా టెస్టుల్లో హాఫ్ సెంచరీ సైతం లేని విరాట్ ఏకంగా శతకమే సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తన సెంచరీల సంఖ్యను 75కు పెంచుకోగలిగాడు.

మూడేళ్ల క్రితమే 72 సెంచరీలతో నిలిచిపోయిన విరాట్..73వ శతకాన్ని ఆసియాకప్ టీ-20 టోర్నీలోనూ, 74వ శతకాన్ని ద్వైపాక్షిక వన్డే సిరీస్ లోనూ, 75వ సెంచరీని టెస్టు సిరీస్ లోనూ సాధించడం విశేషం.

ఆస్ట్ర్రేలియాపై 16వ శతకం...

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా విరాట్ కొహ్లీకి ఇది 16వ సెంచరీ. ఆస్ట్ర్రేలియాపైన అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ( 20 ) పేరుతో ఉంది.

అంతేకాదు..విరాట్ అతి ఎక్కువ బంతులు ఎదుర్కొని సాధించిన శతకాలలో ప్రస్తుత అహ్మదాబాద్ సెంచరీ సైతం చేరింది.

2012 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో నాగపూర్ లో జరిగిన టెస్టులో విరాట్ సెంచరీ సాధించడానికి 289 బంతులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అత్యధికంగా 241 బంతులు ఎదుర్కొనడం ద్వారా ప్రస్తుత అహ్మదాబాద్ టెస్టు శతకం పూర్తి చేయగలిగాడు.

Tags:    
Advertisement

Similar News