పెర్త్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ సెంచరీ
487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. ఆసీస్ టార్గెట్ 533 పరుగులు
పెర్త్ టెస్ట్ లో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేశాడు. 143 బంతుల్లో రెండు సిక్స్ లు, ఎనిమిది ఫోర్లతో 100 పరుగుల మార్క్ దాటాడు. చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీతో అభిమానులకు సండే పరుగుల విందు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, నితీశ్ కుమార్ రెడ్డి దనాదన్ బ్యాటింగ్ తో పెర్త్ టెస్ట్ లో స్కోర్ బోర్డు పరుగులెత్తుతోంది. సిక్త్స్ డౌన్ లో వచ్చిన తెలుగు స్టార్ బ్యాటర్ నితీశ్ 27 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్లతో 3 8పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇద్దరు పోటాపోటీగా బ్యాట్ ఝలిపించడంతో ఆసీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కోహ్లీ సెంచరీ పూర్తి చేయగానే కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు. టీమిండియా 134.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాకు 533 పరగుల టార్గెట్ ఇచ్చారు. ఆస్ట్రేలియా ఇంతవరకు టెస్టుల్లో చేజ్ చేసిన హయ్యెస్ట్ స్కోర్ 404 పరుగులు మాత్రమే. ఆసీస్ ముందు భారీ టార్గెట్ పెట్టడంతో ఒత్తిడిలో ఆసీస్ ప్లేయర్లు ఎలా ఆడుతారో చూడాలి. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియాను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 104 పరుగులకే ఆలౌట్ చేసింది.