అమ్మో.. అమెరికా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సంచ‌ల‌నాల జ‌ట్టు

ఇటీవ‌ల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను యూఎస్ఏ జట్టు 2-1 తేడాతో గెలిచింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పెద్ద‌పెద్ద జ‌ట్ల‌కే షాకులివ్వ‌డం అలవాటు చేసుకున్న బంగ్లా జ‌ట్టుకు షాకిచ్చింది అమెరికా.

Advertisement
Update:2024-06-07 15:25 IST

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వేదిక‌గా అమెరికా.. ఈ మాట చెప్ప‌గానే ఆతిథ్య దేశం కాబ‌ట్టి అమెరికాకు కూడా అవ‌కాశం క‌ల్పించార్లే అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్‌. కానీ, ఇప్పుడు అమ్మో అమెరికా అంటున్నారు. తొలి మ్యాచ్‌లో కెన‌డాను ఓడిస్తే.. చిన్న‌జ‌ట్ల పోరులో అమెరికా గెలిచింద‌నుకున్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్‌ను ఓడించి ఔరా అనిపించింది. ఇక ఇదే గ్రూప్‌లో ఉన్న ఇండియా కూడా అమెరికాతో మ్యాచ్ ఆడ‌బోతోంది. కాబ‌ట్టి మ‌న‌వాళ్లూ బీకేర్ ఫుల్‌.

అల్లాట‌ప్పాగా రాలేదు

ఇటీవ‌ల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను యూఎస్ఏ జట్టు 2-1 తేడాతో గెలిచింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పెద్ద‌పెద్ద జ‌ట్ల‌కే షాకులివ్వ‌డం అలవాటు చేసుకున్న బంగ్లా జ‌ట్టుకు షాకిచ్చింది అమెరికా. ఇదేదో గాలివాటం గెలుపు అన్న‌ట్లుగా చాలామంది తీసిపారేశారు. కానీ, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కెన‌డాతో తొలి మ్యాచ్‌లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో కెన‌డాను ఉతికి ఆరేసింది ఆ జ‌ట్టు. ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్‌నే మ‌ట్టి క‌రిపించింది. పాక్‌ను 159 ప‌రుగుల‌కు క‌ట్ట‌డి చేసి, ఒక‌ద‌శ‌లో అల‌వోక‌గా గెలిచేయాల్సిన మ్యాచ్‌ను టైగా ముగించింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో ధ‌నాధ‌న్ ఆట ఆడి, మ్యాచ్ గెలిచింది.

స్టూవ‌ర్ట్ లా కోచింగ్‌

బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్ త‌ప్ప క్రికెట్ లాంటి గేమ్స్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని అమెరికాలో ఇప్పుడు ప‌రిస్థితి మారుతోంది. విద్య‌, ఉద్యోగ‌, వ్యాపారాల కోసం అక్క‌డికెళ్లి సెటిల‌యిన ఇండియ‌న్లు పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నీల‌తో ఈ ఆట‌పై ఆస‌క్తిని పెంచారు. మ‌రోవైపు అమెరికా టీమ్‌లో స‌గం మంది ఇండియ‌న్లే. ఐసీసీ క్వాలిఫ‌యింగ్ టోర్నీల్లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న యూఎస్ఏ జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు స్టూవ‌ర్ట్ లా శిక్ష‌ణ‌లో రాటుదేలుతోంది.

అమెరికాలో క్రికెట్‌కు ఆద‌ర‌ణ కోసం ఐసీసీ ప్ర‌య‌త్నాలు

ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికాలో క్రికెట్‌కు ఎలాగైనా క్రేజ్ తీసుకురావాల‌ని ఐసీసీ కృత‌నిశ్చ‌యంతో ఉంది. క్రికెట్‌ను ప్ర‌పంచ‌స్థాయిలో ఆడే దేశాలు 20 కూడా లేని నేప‌థ్యంలో అమెరికా లాంటి చోట్ల దానికి ఆద‌ర‌ణ తేగ‌లిగితే ఆ ఫ‌లితాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భావం చూపిస్తాయ‌న్న‌ది ఐసీసీ ఆలోచ‌న‌. అందుకే ప‌ట్టుబ‌ట్టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అమెరికాను కీల‌క వేదిక‌గా పెట్టారు.

Tags:    
Advertisement

Similar News