ఎంపీని పెళ్లాడనున్న రింకూ సింగ్
సమాజ్‌వాదీ ఎంపీ ప్రియా సరోజ్ తో ఎంగేజ్‌మెంట్
టీ 20 విధ్వంసక క్రికెటర్ రింకూ సింగ్ ఎంపీతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ యువ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూసింగ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మచ్లీషహర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రియా ఎంపీగా విజయం సాధించారు. లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న పిన్న వయస్కులైన ఎంపీల్లో ఆమె ఒకరు. రింకూసింగ్‌తో ప్రియా సరోజ్ ఎంగేజ్‌మెంట్ ఇటీవలే జరిగినట్టు ఇరు కుటుంబాల సన్నిహితులు చెప్తున్నారు. కానీ వీరి ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఫొటోలేవి బయటికి రాలేదు. ఐపీఎల్ లో తన విధ్వంసర బ్యాటింగ్ తో కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సొంత చేసుకున్న రింకూ సింగ్ భారత్ తరపున రెండు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 30 టీ20లు ఆడారు. త్వరలో జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం దక్కించుకున్నారు. రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహం ఎప్పుడనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.