స్వదేశీ సిరీస్ ల్లో తిరుగులేని భారత్!

శ్రీలంకతో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికే భారత్ 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది.

Advertisement
Update:2023-01-13 10:53 IST

శ్రీలంకతో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికే భారత్ 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది. సొంతగడ్డపై జరిగే ద్వైపాక్షిక సిరీస్ ల్లో తనకు ఎదురేలేదని మరోసారి చాటుకొంది...

అంతర్జాతీయ క్రికెట్లో స్థానబలంతో చెలరేగిపోతున్న రెండుజట్లలో ఒకటిగా భారత్ తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తోంది. కొత్తసంవత్సరంలో సైతం హోం సిరీస్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది.

శ్రీలంకతో జరిగిన టీ-20 సిరీస్ ను ఇప్పటికే 2-1తో గెలుచుకొన్న భారత్..తీన్మార్ వన్డే సిరీస్ ను సైతం మొదటి రెండుమ్యాచ్ ల్లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఖాయం చేసుకొంది.

ఈడెన్ గార్డెన్స్ లో ఫైటింగ్ విన్!

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండోవన్డే లోస్కోరింగ్ పోరులో భారత్ గెలుపుకోసం తుదివరకూ పోరాడాల్సి వచ్చింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నశ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది.

సమాధానంగా మ్యాచ్ నెగ్గాలంటే 216 పరుగుల లక్ష్యాన్ని చేరుకోడానికి భారత్ నానాపాట్లు పడాల్సి వచ్చింది. 161 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ ను

6వ వికెట్ జోడీ రాహుల్- హార్ధిక్ పాండ్యా 75 పరుగుల భాగస్వామ్యంతో గట్ట్టెక్కించారు.

వైస్ కెప్టెన్ పాండ్యా 53 బాల్స్ లో 4 బౌండ్రీలతో 36 పరుగులకు అవుట్ కాగా..అక్షర్ పటేల్ 21 పరుగులు సాధించాడు. ఐదోడౌన్ లో బ్యాటింగ్ కు దిగిన కెఎల్ రాహుల్..103 బాల్స్ లో 6 బౌండ్రీలతో 64 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. దీంతో భారత్ 4 వికెట్ల విజయంతో సిరీస్ పై 2-0తో పట్టుబిగించగలిగింది.

50వ వన్డేలో 12వ హాఫ్ సెంచరీ...

భారత వన్డేజట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలు అెందిస్తున్న మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫైటింగ్ హాఫ్ సెంచరీతో విమర్శకుల నోటికి తాళం వేయటమే కాక..జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోగలిగాడు.

తన కెరియర్ లో 50వ వన్డే మ్యాచ్ ఆడుతున్న రాహుల్ బాధ్యతాయుతంగా ఆడి 64 పరుగుల నాటౌట్ స్కోరుతో సిరీస్ విజయం ఖాయం చేశాడు. రాహుల్ కు వన్డేలలో ఇది 12వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

అయితే..మూడు వికెట్లతో భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆడిన గత రెండు వన్డేలలో కుల్దీప్ మ్యాచ్ విన్నర్ గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోడం విశేషం.

భారత్ సరికొత్త రికార్డు...

2010 తర్వాత నుంచి స్వదేశంలో జరిగిన సిరీస్ ల్లో భారత్ రికార్డు విజయం సాధించింది. సొంతగడ్డపై తనకు ఎదురేలేదని కొత్తసంవత్సరంలో సైతం చాటుకోగలిగింది.

ప్రస్తుత సిరీస్ లోని కోల్ కతా వన్డే వరకూ శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన మ్యాచ్ ల్లో భారత్ కు 94 విజయాలు, 57 పరాజయాల రికార్డు ఉంది.

స్వదేశీగడ్డపై శ్రీలంకతో ఆడిన 52 వన్డేల్లో భారత్ కు 75 శాతం విజయాల రికార్డు ఉంది. 37 విజయాలు, 12 పరాజయాల రికార్డుతో ఉంది. మరో మూడుమ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.

2007 నుంచి 2021 మధ్యకాలంలో శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన ద్వైపాక్షిక సిరీస్ ల్లో 10సార్లు భారత్ విజేతగా నిలిచింది.1998 నుంచి శ్రీలంక చేతిలో భారత్ కు ఒక్క ఓటమి లేకపోడం విశేషం.

2021 నుంచి స్వదేశీగడ్డపై భారత్ ఆడిన మొత్తం 11 వన్డేలలో 9 విజయాల రికార్డుతో ఉంది. అదే శ్రీలంక మాత్రం 28 వన్డేలు ఆడి..ఇంటా, బయటా 16 పరాజయాలు చవిచూసింది.

పరాజయాలలో శ్రీలంక ప్రపంచరికార్డు..

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరాజయాలు పొందిన జట్టుగా ఇప్పటి వరకూ 4వ ర్యాంకర్ భారత్ పేరుతో ఉన్న436 మ్యాచ్ ల రికార్డును శ్రీలంక అధిగమించింది. కోల్ కతా వేదికగా ముగిసిన రెండోవన్డేలో 4 వికెట్ల పరాజయంతో శ్రీలంక ఓటమిల సంఖ్య 437కు చేరింది. వన్డేల చరిత్రలో అత్యధికంగా 437 పరాజయాలు చవిచూసిన తొలిజట్టుగా శ్రీలంక నిలిచింది.

టీ-20లలో సైతం శ్రీలంకకు 94 పరాజయాలు ఉన్నాయి. శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ అత్యధికంగా 95 విజయాలు సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా పేరుతో ఉన్న రికార్డును సమం చేయగలిగింది.

న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఆస్ట్ర్రేలియా 95 వన్డే విజయాలతో టాపర్ గా నిలిచింది.

మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల నుంచి ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వరకూ స్వదేశీగడ్డపై జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ ల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ తనకుతానే సాటిగా నిలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News