అండర్‌ -19 ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌

సెమీ ఫైనల్‌లో శ్రీలంకపై ఘన విజయం

Advertisement
Update:2024-12-06 19:46 IST

అండర్‌ -19 ఆసియా కప్‌లో భారత కుర్రాళ్లు అదరగొడుతున్నారు. టోర్నీలో ఫైనల్‌ కు చేరుకున్నారు. శుక్రవారం షార్జాలో జరిగిన సెమీ ఫైనల్‌లో శ్రీలంకపై యంగ్‌ ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 13 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి సత్తా చాటి టీమ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. లక్విన్‌ అభిసింఘే 69, షరుజన్‌ షణ్ముగనాథన్‌ 42 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్‌మన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. యంగ్‌ ఇండియా బౌలర్లలో చేతన్‌ శర్మ మూడు, కిరణ్‌ కోర్మలే, ఆయుష్‌ మాత్రే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 174 పరుగుల లక్ష్యాన్ని యంగ్‌ ఇండియా 21.4 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్‌ సూర్యవంశీ 67, ఆయుష్‌ మాత్రే 34, మహ్మద్‌ అమాన్‌ 25, కార్తికేయ 11 పరుగులు చేసి గెలుపు తీరాలకు చేరుకున్నారు.

Tags:    
Advertisement

Similar News