ఐపీఎల్ సిక్సర్ల బాదుడులో ముంబైదే అగ్రస్థానం!

ఐపీఎల్ అంటేనే బౌండ్రీలు, సికర్ల బాదుడు. గత 16 సీజన్లుగా జరిగిన టోర్నీలలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement
Update:2023-04-05 11:21 IST

Top sixes in IPL 2023: ఐపీఎల్ సిక్సర్ల బాదుడులో ముంబైదే అగ్రస్థానం

ఐపీఎల్ అంటేనే బౌండ్రీలు, సికర్ల బాదుడు. గత 16 సీజన్లుగా జరిగిన టోర్నీలలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో నిలిచింది.

20 ఓవర్లు, 60 థ్రిల్స్ గా సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 అంటేనే బౌండ్రీల జోరు, సిక్సర్ల హోరు, పరుగుల వెల్లువ. ఇక..ఐపీఎల్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుత 16వ సీజన్ మొదటి ఏడురౌండ్ల మ్యాచ్ ల్లోనే 200 స్కోర్లను మూడుజట్లు నమోదు చేయగలిగాయి.

హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ పైన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత సీజన్ తొలి ద్విశతక స్కోరు నమోదు చేయగా..చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో

చెన్నై సూపర్ కింగ్స్ 217 పరుగులు, లక్నో సూపర్ జెయింట్స్ 205 పరుగుల స్కోర్లు సాధించగలిగాయి.

అయితే..ప్రస్తుత సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ 7వ రౌండ్ మ్యాచ్ వరకూ రికార్డులను బట్టి చూస్తే అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ నిలిచింది.

232 మ్యాచ్ ల్లో 1415 సిక్సర్లు..

2008 సీజన్ నుంచి ప్రస్తుత 16వ సీజన్ తొలిరౌండ్ వరకూ ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ 232 మ్యాచ్ లు ఆడి 1415 సిక్సర్లు సాధించడం ద్వారా టాపర్ గా నిలిచింది.

ఇక..ముంబై జెయింట్ ఆల్ రౌండర్ కీరాన్ పోలార్డ్ 189 మ్యాచ్ ల్లో 223 సిక్సర్లు బాదడం ద్వారా..అత్యధిక సిక్సర్లు బాదిన ఐపీఎల్ బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

రెండోస్థానంలో బెంగళూరు

రెండుసార్లు రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రస్తుత సీజన్ తొలి రౌండ్ వరకూ ఆడిన 228 మ్యాచ్ ల్లో 1390 సిక్సర్లు నమోదు చేయడం ద్వారా రెండోస్థానంలో

నిలిచింది. బెంగళూరు సూపర్ హిట్టర్ క్రిస్ గేల్ కేవలం 85 మ్యాచ్ ల్లోనే 239 సిక్సర్లు బాదడం ద్వారా పోలార్డ్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

1294 సిక్సర్లతో చెన్నై సూపర్ కింగ్స్...

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగుసార్లు టైటిల్ అందుకోడమే కాదు..అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల వరుసలో మూడోస్థానం సంపాదించింది.

ప్రస్తుత 16వ సీజన్ రెండోరౌండ్ వరకూ చెన్నై జట్టు ఆడిన మొత్తం 211 మ్యాచ్ ల్లో1294 సిక్సర్లు సాధించింది. చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ 211 మ్యాచ్ ల్లో 202

సిక్సర్లు నమోదు చేశాడు. అత్యధిక సిక్సర్లు బాదిన చెన్నై బ్యాటర్ గా నిలిచాడు.

నాలుగో స్థానంలో పంజాబ్...

గత 15 సీజన్లలో ఒక్కసారి టైటిల్ నెగ్గని పంజాబ్ కింగ్స్ జట్టు సిక్సర్ల బాదుడులో నాలుగో అత్యుత్తమ టీమ్ గా నిలిచింది. ప్రస్తుత సీజన్ తొలిరౌండ్ వరకూ 219 మ్యాచ్ లు

ఆడిన పంజాబ్ జట్టు 1285 సిక్సర్లు సాధించింది.

పంజాబ్ తరపున కెఎల్ రాహుల్ అత్యధికంగా 55 మ్యాచ్ ల్లో 110 సిక్సర్లు నమోదు చేశాడు.

1233 సిక్సర్లతో కోల్ కతా..

రెండుసార్లు ఐపీఎల్ విజేత కోల్ కతా నైట్ రైడర్స్ అత్యధిక సిక్సర్లు బాదిన ఐదోజట్టుగా రికార్డుల్లో నిలిచింది. ప్రస్తుత సీజన్ మొదటి రౌండ్ వరకూ ఆడిన 224 మ్యాచ్ ల్లో కోల్ కతా 1233 సిక్సర్లు నమోదు చేసింది.

కోల్ కతా నైట్ రైడర్స్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా కరీబియన్ డైనమైట్ యాండ్రీ రస్సెల్ నిలిచాడు. రస్సెల్ 92 మ్యాచ్ ల్లో 174 సిక్సర్లు బాదాడు.

గత రెండుసీజన్లుగా తడబడుతూ అట్టడుగుకు పడిపోయిన ముంబై ఇండియన్స్ అత్యధిక టైటిల్స్ సాధించిన జట్టుగా మాత్రమే కాదు..అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్ గాను అగ్రస్థానంలో కొనసాగటం విశేషం.

Tags:    
Advertisement

Similar News