పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ జట్టులో ఒకే ఒక్క తెలుగు అథ్లెట్!

2024 పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టుకు బల్లెంవీరుడు నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.

Advertisement
Update:2024-07-05 12:45 IST

2024 పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టుకు బల్లెంవీరుడు నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.

పారిస్ వేదికగా ఈనెల 26న ప్రారంభం కానున్న ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ జట్టు ఖరారయ్యింది. 17 మంది పురుషులు, 11మంది మహిళా అథ్లెట్లతో కూడిన జట్టుకు భారత ఒలింపిక్స్ సమాఖ్య ఆమోదం తెలిపింది.

నీరజ్ చోప్రా నాయకత్వంలో....

గత ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణ పతకం సాధించి పెట్టిన బల్లెం విసురుడులో బాహుబలి నీరజ్ చోప్రా..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో సైతం హాట్ ఫేవరెట్ గా బంగారు వేటకు దిగుతున్నాడు. నీరజ్ నాయకత్వంలోనే 28 మంది సభ్యుల భారత జట్టు పతకాలవేటకు సిద్ధమయ్యింది.

భారత అథ్లెట్ల బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ ప్రధాన శిక్షకుడు రాధాకృష్ణన్ నాయర్ అధికారికంగా ప్రకటించారు లాంగ్ జంపర్ జెస్విన్ ఆల్డ్ర్రిన్ కు సైతం ఒలింపిక్స్ బెర్త్ ఖరారు కానుంది.

భారతజట్టులో ఒకే ఒక్క తెలుగు అథ్లెట్....

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి ఎంపికైన 28 మంది సభ్యుల భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ జట్టులో ఒకే ఒక్క తెలుగు అథ్లెట్ కు చోటు దక్కింది. మహిళల 100 మీటర్ల హర్డల్స్ రేస్ లో ఆంధ్రప్రదేశ్ రన్నర్ జ్యోతి యర్రాజీ తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో నిలువనుంది.

ఒలింపిక్స్ అర్హత ప్రమాణాల రికార్డును అందుకోడంలో సెకనులో వందో వంతులో విఫలమైన జ్యోతి.. ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రాతిపదికన ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సాధించగలిగింది. భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల హర్డల్స్ విభాగంలో పాల్గొనబోతున్న భారత తొలి అథ్లెట్ గా రికార్డుల్లో చేరనుంది.

మొత్తం 11 మంది భారత మహిళా అథ్లెట్లలో కిరణ్ పహాల్ (400 మీటర్ల పరుగు), పారుల్ చౌదరిy (3,000మీటర్ల స్టీపుల్ చేజ్, 5,000మీటర్ల పరుగు), జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్ ), అన్ను రాణి (జావిలిన్ త్రో), అభా ఖటువా ( షాట్ పుట్ ), జ్యోతిక శ్రీ దండి, శుభా వెంకటేశన్, విత్య రామ్ రాజ్, పూవమ్మ , ప్రాచీ(4x400 మీటర్ల రిలే ), ప్రియాంక గోస్వామి (20కిలోమీటర్ల రేస్ వాక్, మిక్సిడ్ మారథాన్ ) పురుషులజట్టులో హేమాహేమీలు.

మొత్తం 17 మంది పురుషుల జట్టుకే నీరజ్ చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. వరుసగా రెండో ఒలింపిక్స్ బంగారు పతకం సాధించడానికి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు. ఇప్పటికే ప్రపంచ, ఒలింపిక్స్ పతకాలు సాధించిన నీరజ్ భారత్ కు కచ్చితంగా ఏదో ఒక పతకం సాధించి పెట్టగలడని భావిస్తున్నారు.

ఆసియా చాంపియన్లు అవినాశ్ సాబ్లే, తేజిందర్ పాల్ టూర్, హైజంపర్ సర్వేశ్ అనీల్ కుషారే, కిశోర్ జెనా సైతం ప్రముఖ అథ్లెట్లుగా ఉన్నారు.

పురుషుల 4x400 మీటర్ల రిలే జట్టులో మహ్మద్ అనాస్, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకోబ్, రాజేశ్ రమేశ్ పోటీకి దిగనున్నారు.

జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలను ఆగస్టు 1 నుంచి 11 వరకూ నిర్వహిస్తారు. పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కచ్చితంగా పతకం సాధించే అంశం ఏదైనా ఉంటే...అది కేవలం పురుషుల జావలిన్ త్రో మాత్రమే. ఆ అథ్లెట్ మరెవరో కాదు..బల్లెం విసురుడులో బాహుబలి, ప్రపంచ విజేత, 26 సంవత్సరాల నీరజ్ చోప్రా మాత్రమే.

Tags:    
Advertisement

Similar News