ఇంగ్లాండ్ ఇగో మీద కొట్టిన ఒక్క మగాడు మన రోహిత్‌శర్మ
బజ్‌బాల్ గేమ్‌తో టెస్ట్ క్రికెట్‌కు కొత్త దూకుడు తీసుకొచ్చిన ఇంగ్లాండ్‌కు ఇండియా వరుసగా షాకులిస్తోంది.
బజ్‌బాల్ గేమ్‌తో టెస్ట్ క్రికెట్‌కు కొత్త దూకుడు తీసుకొచ్చిన ఇంగ్లాండ్‌కు ఇండియా వరుసగా షాకులిస్తోంది. తిరుగులేని విజయాలతో ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లీష్ జట్టుకు మనవాళ్లు రాజకోట్ టెస్ట్‌లో అసలైన బజ్‌బాల్ చూపించారు. యశస్వి జైస్వాల్, సర్పరాజ్‌ఖాన్ జంట రెండో ఇన్నింగ్స్‌లో 158 బంతుల్లోనే 172 పరుగులు సాధించి దిమ్మతిరిగేలా చేసింది. జైస్వాల్ అయితే ఏకంగా 12 సిక్సర్లు బాది ఇది బజ్‌బాల్ కాదు ఇది జైస్బాల్ అని చూపించాడు.
ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలంటే వణుకే
బజ్‌బాల్ ఆట మొదలుపెట్టినప్పటి నుంచి 19 మ్యాచ్‌ల్లో 13 టెస్ట్ లు గెలిచింది ఇంగ్లాండ్. ఈ 19 మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు ఆ జట్టు మీద ఏ ప్రత్యర్థి కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి సాహసించలేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ ఓవర్‌కు 5,6 పరుగుల రన్‌రేట్‌తో ధనాధన్ ఆట ఆడేస్తూ ఎంత భారీ స్కోరయినా కరిగించేస్తోంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువ పరుగుల టార్గెట్ ఇంగ్లాండ్ ముందు పెడితే మంచిదని సేఫ్ గేమ్ ఆడారు అందరు కెప్టెన్లు.
ఒక్క మగాడు రోహిత్
కానీ రోహిత్ శర్మ అలా కాదుగా.. బజ్‌బాల్ ఆటాడుతున్న ఇంగ్లాండ్‌కు మన దూకుడు చూపించాడు. కొత్త కుర్రాళ్లు గిల్, జైస్వాల్, సర్ఫరాజ్ బాదేయడంతో భారీ స్కోరు సాధించి నాలుగు వికెట్ల నష్టానికే డిక్లేర్ చేసి పారేశాడు. బజ్‌బాల్ ఎరాలో ఇంగ్లాండ్ మీద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించి, ఆడు మగాడ్రా బుజ్జీఅనిపించుకున్నాడు.