గబ్బా టెస్టు.. ఆసీస్ 89/7 డిక్లేర్
భారత్ ముందు 275 పరుగుల విజయ లక్ష్యం
గబ్బా టెస్టు లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను ముగించింది. 89/7 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. ఆట ప్రారంభమయ్యాక కొద్దిసేపటికే ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయింది. బూమ్రా, ఆకాశ్‌దీప్ ద్వయం కేవలం 28 రన్స్‌కే ఆసీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. బూమ్రా 3 వికెట్లు తీయగా.. .ఆకాశ్, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యాన్ని సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 89 రన్స్ చేసింది.
బూమ్రా అరుదైన ఘనత
మొదట జస్‌ప్రీత్ బూమ్రా బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా బౌల్డ్‌తో భారత వికెట్ల వేట మొదలైంది. కీలక బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను బూమ్రా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అవతరించాడు. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ను అధిగమించాడు. జస్‌ప్రీత్ బూమ్రా ఆస్ట్రేలియాలో 10 మ్యాచ్‌ల్లో (గబ్బా టెస్టుతో కలిపి) 53 వికెట్లు పడగొట్టాడు. 17.21 సగటుతో మెరుగైన ప్రదర్శన చేశాడు. కపిల్ దేవ్ 11 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు, అనిల్ కుంబ్లే 10 మ్యాచ్ ల్లో 49, అశ్విన్ 11 మ్యాచ్‌ల్లో 40, బిషన్ సింగ్ బేడి 7మ్యాచ్ ల్లో 35 వికెట్లు పడగొట్టాడు. ఇక గబ్బా మ్యాచ్‌లో ఆసీస్ వికెట్లను కోల్పోతున్నప్పటికీ వేగంగా ఆడేందుకు యత్నించాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ (22) దూకుడు ప్రదర్శించాడు. అతణ్ణి బూమ్రా పెవలియిన్‌కు చేర్చాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 252/9 తో ఐదు రోజు ఆటను ఆరంభించిన భారత్.. మరో 8 రన్స్‌ను జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ (31) చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. జస్ ప్రీత్ బూమ్రా (10*) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆసీస్‌కు 185 రన్స్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 రన్స్ చేసిన విషయం విదితమే.