ఫాలో ఆన్‌ గండాన్ని తప్పించిన పేసర్లు

కేఎల్‌ రాహుల్‌, జడేజా తప్పా తడబడిన స్టార్‌ బ్యాటర్లు

Advertisement
Update:2024-12-17 14:25 IST

టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లంతా తగబాటుకు గురయ్యారు. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా మినహా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తాశారు. దీంతో భారత్‌ను త్వరగా చుట్టేసి ఫాలో ఆన్‌ ఆడించాలన్న ఆసీస్‌ బౌలర్ల ఆశలను వమ్ము చేశారు. కంగారు బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారారు. బ్యాటర్ల కంటే తామేమీ తక్కువ కాదని, అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ రాణించగలమని జస్‌ ప్రీత్‌ బూమ్రా-ఆకాశ్‌ దీప్‌ నిరూపించారు. స్టార్‌ బ్యాటర్లకే సాధ్యం కాని విధంగా పోరాడి జట్టును ఫాలో ఆన్‌ గండం నుంచి బైటపడేశారు ఈ పేస్‌ బౌలర్లు.

బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్సింగ్స్‌లో మరోసారి సీనియర్లు తీవ్ర నిరాశపరిచారు. దీంతో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 252 రన్స్‌ చేసింది. టాప్‌ ఆర్డర్‌లో కేఎల్‌ రాహుల్‌ (84), మినహా ఎవ్వరూ రెండు అంకెల స్కోర్‌కు చేరుకోలేకపోయారు. చివర్లో రవీంద్ర జడేజా (77) ఒంటరి పోరాటం చేయడంతో స్కోర్‌ 200 దాటగలిగింది. ఆఖర్లో ఒక్కో రన్‌ చేస్తూ బూమ్రా (10 నాటౌట్‌), ఆకాశ్‌ దీప్‌ (27 నాటౌట్‌) టీమిండియాకు ఫాలో ఆన్‌ గండాన్ని తప్పించారు. భారత్‌ ఇంకా 193 రన్స్‌ వెనుకంజలో ఉన్నది.

అంతకుముందు యశస్వి జైస్వాల్‌ (4), శుభ్‌మన్‌ గిల్‌ (1), విరాట్‌ కోహ్లీ (3), రిషభ్‌ పంత్‌ (9), సిరాజ్‌ (1), సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. రోహిత్‌ శర్మ (10), నితీశ్‌ కుమార్‌ (16), రన్స్‌ చేశారు. ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌ 4, మిచెల్‌ స్టార్క్‌ 3.. జోష్‌ హేజిల్‌వుడ్‌, నాథన్‌ లైయన్‌ చెరో వికెట్‌ తీశారు.

Tags:    
Advertisement

Similar News