బ్రిస్బేన్‌ టెస్ట్‌లో రెండురోజు ఆసీస్ సోర్క్‌ 405/7

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది

Advertisement
Update:2024-12-15 17:16 IST

గబ్బా వేదికగా బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ భారీ స్కోర్‌ దిశగా దూసుకువెళ్తున్నది. తొలిరోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 405 రన్స్ చేసింది. మిచెల్ స్టార్క్ ఏడు పరుగులతో, అలెక్స్ కారీ 45 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

ట్రావిస్ హెడ్ 152 పరుగులు, స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేశారు. మరోవైపు, భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో కేరి 45, మిచెల్ స్టార్క్ ఉన్నారు. కాగా భారత ఔలర్లలో బూమ్ర 5 వికెట్లు తీసుకొగా నితిష్ కుమార్ రెడ్డి, సిరజ్ చెరో వికెట్ తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా చర్రిత సృష్టించింది. 9 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సొంతగడ్డపై భారత్‌తో 400 ప్లస్ స్కోర్‌ను నమోదు చేసింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ ఈ ఫీట్ సాధించింది.

Tags:    
Advertisement

Similar News