స్వదేశీ సిరీస్ ల్లో అజేయ భారత్!
ప్రపంచ క్రికెట్ కేంద్రబిందువు భారత్ స్వదేశీ సిరీస్ ల్లో అజేయ విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2019 నుంచి వరుసగా 25 సిరీస్ ల్లో ఓటమి లేని జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది.
ప్రపంచ క్రికెట్ కేంద్రబిందువు భారత్ స్వదేశీ సిరీస్ ల్లో అజేయ విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2019 నుంచి వరుసగా 25 సిరీస్ ల్లో ఓటమి లేని జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది.
ప్రపంచక్రికెట్లో భారత్ ఆధిక్యం కొనసాగుతోంది. టెస్టు క్రికెట్లో రెండోర్యాంక్, టీ-20, వన్డే ఫార్మాట్లలో టాప్ ర్యాంక్ జట్టుగా నిలిచిన భారత్ ..న్యూజిలాండ్ తో ముగిసిన టీ-20 సిరీస్ విజయం ద్వారా స్వదేశీ సిరీస్ ల్లో అజేయజట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇంట్లో పులి అన్న తనపేరును మరోసారి సార్థకం చేసుకొంది.
2019 నుంచి 2023 వరకూ....
2019 సెప్టెంబర్ నుంచి 2023 ఫిబ్రవరి 1 వరకూ..క్రికెట్ మూడు ఫార్మాట్లలోను కలిపి సొంతగడ్డపై 25 సిరీస్ లు ఆడిన భారత్ అజేయంగా నిలవడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డుతో ఈ ఘనత సాధించిన తొలిజట్టుగా నిలిచింది.
2019లో భారతగడ్డపై ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లో 2-3తో చివరిసారిగా ఓటమి పొందిన భారత్..ఆ తర్వాత నుంచి గత 25 సిరీస్ ల్లో కనీసం ఒక్క ఓటమి లేకుండా అజేయంగా నిలుస్తూ రావడం విశేషం.
టీ-20 సిరీస్ ల్లో భారత్ టాప్...
స్వదేశంలో జరిగిన టీ-20 సిరీస్ ల్లో భారత్ అత్యధిక విజయాలతో తిరుగులేని జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్ తో ముగిసిన 2023 టీ-20 సిరీస్ లో అతిపెద్ద విజయంతో 2-1తో సిరీస్ నెగ్గిన భారత్..సొంతగడ్డపై 50వ టీ-20 విజయం నమోదు చేసింది.
తమతమ దేశాలలో అత్యధిక టీ-20 మ్యాచ్ లు నెగ్గినజట్లలో న్యూజిలాండ్ ( 42), దక్షిణాఫ్రికా ( 37), ఆస్ట్ర్రేలియా ( 36 ), వెస్టిండీస్ ( 36) టాప్ ర్యాంకర్ భారత్ తర్వాతి స్థానాలలో నిలిచాయి.
టెస్టుసిరీస్ ల్లో 15 విజయాలు...
గత దశాబ్దకాలంలో సొంతగడ్డపై ఆడిన టెస్టు సిరీస్ ల్లో భారత్ కు 88 శాతం విజయాలున్నాయి. మొత్తం ఆడిన 17 సిరీస్ ల్లో 15 విజయాలు, ఓ సిరీస్ ఓటమి, ఓ సిరీస్ డ్రా రికార్డు భారత్ కు ఉంది. 88 శాతం విజయాలు, 94 శాతం డ్రా ఫలితాలు సాధించడం విశేషం.
భారత్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ నిలిచింది. స్వదేశంలో ఇంగ్లండ్ విజయశాతం 75 కాగా..డ్రాల శాతం 90గా నమోదయ్యింది.
50 ఓవర్లలో వన్డే క్రికెట్లో భారత్ వేదికగా గత దశాబ్దకాలంలో ఆడిన 17 సిరీస్ ల్లో 14 విజయాలు, 3 పరాజయాలతో 85 శాతం విజయాలు నమోదు చేసింది.
76 శాతం విజయాలతో దక్షిణాఫ్రికా రెండు, 68 శాతం విజయాలతో ఇంగ్లండ్ మూడుస్థానాలలో నిలిచాయి.
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ రికార్డుస్థాయిలో స్వదేశీ సిరీస్ విజయాలు సాధించడం మరో అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.
ధోనీ తర్వాత సొంతగడ్డపై అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా విరాట్ కొహ్లీ నిలిచాడు.
టెస్ట్ హోదా పొందిన మొత్తం తొమ్మిది దేశాలజట్లు తమతమ దేశాలలో ఆడిన సిరీస్ లు, సాధించిన విజయాల గణాంకాలు చూస్తే భారత్ తిరుగులేని జట్టుగా నిలిచింది.
ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి అగ్రశ్రేణిజట్లపై భారత్ మెరుగైన ఫలితాలు సాధించగలిగింది.
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారత విజయాలశాతం 45 నుంచి 69కి, వన్డే క్రికెట్లో విజయశాతం 55 నుంచి 70కి పెరగటం
2023లో నాలుగుకు నాలుగు విజయాలు..
2023 క్రికెట్ సీజన్ ను భారతజట్టు అత్యంత విజయవంతంగా ప్రారంభించింది. ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంకతో జరిగిన సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయం సాధించిన భారత్..వన్డే, టీ-20 ఫార్మాట్లలో న్యూజిలాండ్ ను చిత్తు చేయడం ద్వారా అజేయంగా నిలిచింది.
అయితే...ఈ నెల 9 నుంచి ప్రపంచ మేటి ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్, ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ ల్లో భారత్ ఇదేజోరు కొనసాగించగలదా? అనుమానమే.
స్వదేశంలో భారత జైత్రయాత్ర రికార్డుకు గండికొట్టగల ఏకైకజట్టు ఆస్ట్ర్రేలియా మాత్రమే.