పదోసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జోకోవిచ్

సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ రికార్డుస్థాయిలో పదోసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ కు చేరుకొన్నాడు. పదో టైటిల్ కు గురిపెట్టాడు.

Advertisement
Update:2023-01-28 14:24 IST

సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ రికార్డుస్థాయిలో పదోసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ కు చేరుకొన్నాడు. పదో టైటిల్ కు గురిపెట్టాడు.

2023 సీజన్ గ్లాండ్ స్లామ్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్, తొమ్మిదిసార్లు విజేత నొవాక్ జోకోవిచ్ చేరుకొన్నాడు. మెల్బోర్న్ వేదికగా

జరుగుతున్న ఈటోర్నీలో 35 సంవత్సరాల జోకోవిచ్ స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచాడు.

ఊరిస్తున్న పదో టైటిల్..

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ చరిత్రలో పురుషుల సింగిల్స్ టైటిల్ ను రికార్డుస్థాయిలో ఇప్పటికే తొమ్మిదిసార్లు నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిన జోకోవిచ్..పదోసారి నెగ్గడం ద్వారా తన రికార్డును తానే అధిగమించాలని భావిస్తున్నాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన సెమీఫైనల్లో జోకోవిచ్ 7-5, 6-1, 6-1తో అమెరికన్ అన్ సీడెడ్ ఆటగాడు టోమీ పాల్ ను చిత్తు చేశాడు. ఇప్పటికే తన కెరియర్ లో 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన జోకోవిచ్ కు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇది వరుసగా 27వ గెలుపు కావడం విశేషం. ఏకబిగిన 27 మ్యాచ్ లు నెగ్గడం తో పాటు పదిసార్లు ఫైనల్స్ చేరిన ఏకైక ఆటగాడిగా జోకోవిచ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఫైనల్లో సిటిస్ పాస్ తో జోకో ఢీ...

అంతకుకు ముందు జరిగిన ఆస్ట్ర్ర్రేలియన్ ఓపెన్ తొలిసెమీఫైనల్లో గ్రీకు వీరుడు, 3వ సీడ్ సిటిస్ పాస్ నాలుగుసెట్ల పోరులో 18వ సీడ్ కారెన్ కచనోవ్ ను అధిగమించాడు.

సిటిస్ పాస్ 7-6, 6-4, 6-7, 6-3తో విజేతగా నిలిచాడు.

గతంలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జోకోవిచ్ చేతిలో ఓటమి పొందిన 24 సంవత్సరాల సిటిస్ పాస్ తొలిసారిగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ పోరులో హాట్ ఫేవరెట్ జోకోవిచ్ తో తలపడనున్నాడు.

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన పదికి పది మ్యాచ్ లు నెగ్గడం ద్వారా 10-0 రికార్డుతో ఉన్న సిటిస్ పాస్..ఫైనల్లో జోకోవిచ్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

2019 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో రోజర్ ఫెదరర్ పై సంచలన విజయం సాధించడం ద్వారా దూసుకొచ్చిన సిటిస్ పాస్ కు 2021, 2022 టోర్నీల సెమీస్ చేరిన రికార్డు ఉంది.

టైటిల్ సమరంలో నెగ్గిన ఆటగాడికి 15 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో పాటు...ట్రోఫీని అందచేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News