టీ బ్రేక్‌ సమయానికి టీమిండియా 51/2

ఇంకా 423 రన్స్‌ వెనుకబడి ఉన్న టీమిండియా

Advertisement
Update:2024-12-27 10:36 IST

బాక్సింగ్‌ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడేలా ఉన్నది. రెండో రోజు టీ బ్రేక్‌ సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ (3) మరోసారి విఫలమవడం అభిమానులను నిరాశపరిచింది. వన్‌డౌన్‌లో వచ్చి కేఎల్‌ రాహుల్‌ (24) నిలకడగా ఆడుతున్నట్లు కనిపించినా.. పాట్‌ కమిన్స్‌ స్వింగ్‌ బౌల్‌కు క్లీన్‌ బోల్డ్‌ అయ్యాడు. అంతకుముందు కమిన్స్‌ బౌలింగ్‌లోనే రోహిత్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి బోలాండ్‌ చేతికి చిక్కాడు. టీమిండియా ఇంకా 423 రన్స్‌ వెనుకబడి ఉన్నది. ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 474 రన్స్‌ చేసిన విషయం విదితమే. 

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 రన్స్‌కు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ 140, సామ్‌ కొనస్టాస్‌ 60, ఖవాజా 57, లబుషేన్‌ 72, కమిన్స్‌ 49 రన్స్‌ చేశారు. భారత బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు, జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2 వికెట్లు, సుందర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 

Tags:    
Advertisement

Similar News