టీ20 ప్రపంచకప్ : శ్రీలంకపై భారత్ విజయం

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది

Advertisement
Update:2025-01-23 15:56 IST

అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో భారత్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 118/9 పరుగులు చేసింది.119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 58 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో షబ్నమ్‌ 2, జోషిత 2, పరుణిక సిసోదియా 2, ఆయుషి 1, వైష్ణవి 1 వికెట్‌ తీశారు. భారత్ బ్యాటర్ త్రిష 49 పరుగులు చేసింది.

Tags:    
Advertisement

Similar News