టీ-20 క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు!
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో 15 పరుగుల అత్యల్పస్కోరు సరికొత్త ప్రపంచ రికార్డుగా నమోదయ్యింది. ఆస్ట్ర్రేలియా దేశవాళీ క్రికెట్ బిగ్ బాష్ లీగ్ లో ఈ చెత్త రికార్డును సిడ్నీ థండర్స్ మూటగట్టుకొంది.
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో 15 పరుగుల అత్యల్పస్కోరు సరికొత్త ప్రపంచ రికార్డుగా నమోదయ్యింది. ఆస్ట్ర్రేలియా దేశవాళీ క్రికెట్ బిగ్ బాష్ లీగ్ లో ఈ చెత్త రికార్డును సిడ్నీ థండర్స్ మూటగట్టుకొంది.....
20 ఓవర్లు..60 థ్రిల్స్ గా సాగిపోయే టీ-20 క్రికెట్ అంటే సిక్సర్ల హోరు, బౌండ్రీల జోరు, పరుగుల వెల్లువ మాత్రమే కాదు...వికెట్ల వరద కూడా అని..ఆస్ట్ర్రేలియా దేశవాళీ క్రికెట్ బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ ద్వారా తేలింది.
అడిలైడ్ స్ట్ర్రయికర్స్ తో జరిగిన 2022-23 సీజన్ బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ జట్టు కేవలం 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలిపోయింది. పురుషుల టీ-20 క్రికెట్ చరిత్రలోనే ఇదే అత్యల్ప స్కోరుగా నమోదయ్యింది.
సిడ్నీలోని షోగ్రౌండ్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లు థోర్న్ టన్, అగర్ కలసి 9 పరుగులకే 9 వికెట్లు పడగొట్టడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో మాత్రమే కాదు..టీ-20 పురుషుల ఫార్మాట్లోనే ఇదే అత్యల్ప స్కోరుగా , ప్రపంచ రికార్డుగా నిలిచింది.
అడిలైడ్ స్ట్రైకర్స్ తన ఎదుట ఉంచిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ థండర్స్ కుప్పకూలింది. ఆడిలైడ్ బౌలర్లు విజృంభించడంతో ఒకరి తర్వాత ఒకరుగా పెవీలియన్ దారి పట్టారు. ఈ క్రమంలో సిడ్నీ థండర్స్ కేవలం 5.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయింది. 124 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సిడ్నీ థండర్స్ టాప్ స్కోరు 4 పరుగులు మాత్రమే. అది కూడా పదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన బ్రెండన్ డగ్గెట్ నాలుగు పరుగులు సాధించగలిగాడు.
కరీబియన్ రికార్డు తెరమరుగు..
ఇప్పటి వరకూ కరీబియన్ క్రికెట్ లో నమోదైన 18 పరుగుల ఆలౌట్ స్కోరే అత్యల్ప టీ-20 స్కోరుగా ఉంది. 2007 వెస్టిండీస్ వన్డే కప్ పోటీలలో భాగంగా బార్బొడోస్- వెస్టిండీస్ అండర్ -19 జట్ల మ్యాచ్ లో 18 పరుగుల ఆలౌట్ స్కోరు నమోదయ్యింది.
ఆ స్కోరును ప్రస్తుత బిగ్ బాష్ లీగ్ ద్వారా సిడ్నీ థండర్స్ తెరమరుగు చేయగలిగింది.
సిడ్నీ థండర్స్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, మాథ్యూ గిల్కిస్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఆ జట్టు 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఏకంగా ఐదుగురు టాపార్డర్ బ్యాటర్లు ఖాతా తెరవకుండానే డకౌట్లుగా డ్రెస్సింగ్ రూమ్ బాటపట్టారు. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌరల్ హెర్నీ థార్న్‌టన్ 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
టీ 20 మ్యాచ్ చరిత్రలో లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్ల రికార్డు చెక్ రిపబ్లిక్, లెసోథోల పేరుతో ఉంది.
2019లో చెక్‌రిపబ్లిక్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకు ఆలౌట్ అయింది. 26 పరుగుల అత్యల్ప స్కోరుతో లెసోథో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
టీ-20 ఫార్మాట్ పురుషుల విభాగంలో 15, 18, 21, 26 పరుగుల స్కోర్లే అత్యల్పస్కోర్లుగా ఉన్నాయి.