టీ-20 నయా నంబర్ వన్ సూర్యకుమార్!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను భారత సంచలనం సూర్యకుమార్ యాదవ్ సాధించాడు. ఇప్పటి వరకూ అగ్రస్థానంలో ఉన్న కాన్వే, మహ్మద్ రిజ్వాన్ లను సూర్య అధిగమించాడు.

Advertisement
Update:2022-11-02 16:54 IST

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను భారత సంచలనం సూర్యకుమార్ యాదవ్ సాధించాడు. ఇప్పటి వరకూ అగ్రస్థానంలో ఉన్న కాన్వే, మహ్మద్ రిజ్వాన్ లను సూర్య అధిగమించాడు...

టీ-20 క్రికెట్ 2022 సీజన్లో భారత నయాస్టార్ సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతోంది. ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో నిలకడగా రాణించడం ద్వారా ర్యాంకింగ్స్ లో సైతం అగ్రస్థానంలో నిలిచాడు.

అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన నాలుగోరౌండ్ పోరులో సూర్యకుమార్ 30 పరుగుల స్కోరు సాధించడం ద్వారా టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకొన్నాడు.

తన సమీప ప్రత్యర్థులు డేవిడ్ కాన్వే, మహ్మద్ రిజ్వాన్ లను అధిగమించి మొత్తం 863 పాయింట్లతో టాప్ ర్యాంకర్ గా అవతరించాడు. ఐసీసీ టాప్ -10 బ్యాటర్లలో నిలిచిన ఆటగాళ్లలో విరాట్ కొహ్లీ సైతం ఉన్నాడు.

అత్యధిక పరుగుల మొనగాడు...

ప్రస్తుత ప్రపంచకప్ సూపర్ -12 తొలిమ్యాచ్ లో పాక్ పై 15 పరుగులకే అవుటైన సూర్యకుమార్..రెండోరౌండ్లో నెదర్లాండ్స్, మూడోరౌండ్లో దక్షిణాఫ్రికాలపై స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తో నాలుగోరౌండ్ మ్యాచ్ లో సైతం సూర్య 30 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. 15 బాల్స్ లో 4 బౌండ్రీలతో 187 స్ట్ర్రయిక్ రేట్ తో దూకుడుమీదున్న సూర్యను బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ పడగొట్టాడు.

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన రికార్డును విరాట్ కొహ్లీ అందుకొన్న రోజే సూర్యకుమార్ టాప్ ర్యాంకర్ గా నిలవడం విశేషం.

టీ-20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ తర్వాతి స్థానాలలో న్యూజిలాండ్ హిట్టర్ డేవిడ్ కాన్వే, పాక్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ లు కొనసాగుతున్నారు.

2022 క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ ఘనతను సైతం సూర్యకుమార్ యాదవ్ దక్కించుకొన్నాడు.

Tags:    
Advertisement

Similar News