విరాట్ కొహ్లీని మించిన సూర్యకుమార్ యాదవ్!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగుతోంది. సీజన్ కు వెయ్యి పరుగులు సాధించడంలో విరాట్ కొహ్లీతో పాటు మరో ఇద్దరు స్టార్ బ్యాటర్లను సూర్య అధిగమించాడు.

Advertisement
Update:2023-08-15 17:15 IST

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగుతోంది. సీజన్ కు వెయ్యి పరుగులు సాధించడంలో విరాట్ కొహ్లీతో పాటు మరో ఇద్దరు స్టార్ బ్యాటర్లను సూర్య అధిగమించాడు...

టీ-20 క్రికెట్ 7వ ర్యాంకర్ వెస్టిండీస్ తో ముగిసిన పాంచ్ పటాకా సిరీస్ భారత్ కు చేదుఅనుభవాన్ని మిగిల్చినా..ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్, భారత వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను మాత్రం అత్యంత విజయవంతమైన బ్యాటర్ గా నిలబెట్టింది.

గ్రౌండ్ లో ఏమూలకైనా ధాటిగా షాట్లు కొట్టడంలో మొనగాడిగా పేరున్న సూర్యకుమార్..కరీబియన్ సిరీస్ 5 మ్యాచ్ ల్లో నాలుగు ఇన్నింగ్స్ లో మాత్రమే బ్యాటింగ్ కు దిగి రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 166 పరుగులతో 41.50 సగటు నమోదు చేశాడు. నిర్ణయాత్మక ఆఖరిమ్యాచ్ లో సూర్య 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచినా ప్రయోజనం లేకపోయింది.

రాహుల్ సరసన సూర్య...

వెస్టిండీస్ తో సిరీస్ లో జట్టుగా భారత్ విఫలమైనా...బ్యాటర్ గా సూర్య సఫలమయ్యాడు. తన ఖాతాలో మరో అరుదైన రికార్డును చేర్చుకోగలిగాడు. 2019 సీజన్ నుంచి మూడుసార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఇద్దరు భారత బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.

కరీబియన్ సిరీస్ 4వ మ్యాచ్ వరకూ విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, సురేశ్ రైనాలతో కలసి రెండు సీజన్లలో వెయ్యి పరుగులు సాధించిన రికార్డును పంచుకొన్నాడు. అయితే ఆఖరి మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ బాదడం ద్వారా మూడోసారి వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోడం ద్వారా విరాట్ కొహ్లీ లాంటి దిగ్గజాన్నే రెండోస్థానానికి నెట్టి అగ్రస్థానానికి చేరుకొన్నాడు.

సూర్య కంటే ముందే మూడుసార్లు సీజన్ కు 1000 పరుగులు సాధించిన భారత బ్యాటర్ రికార్డు కెఎల్ రాహుల్ పేరుతో మాత్రమే ఉంది. రాహుల్ 2019, 2020, 2022 సీజన్లలో వెయి పరుగుల రికార్డు సాధించాడు.

సూర్యకుమార్ యాదవ్ 2019, 2022, 2023 సీజన్లలో వెయ్యి పరుగులు చొ్ప్పున నమోదు చేశాడు. విరాట్ కొహ్లీ 2016, 2022 సీజన్లలోనూ, శ్రేయస్ అయ్యర్ 2019, 2022, సురేశ్ రైనా 2010, 2018 సీజన్లలోనూ వెయ్యి పరుగుల రికార్డులు సాధించారు.

ఐర్లాండ్ తో జరిగే తీన్మార్ సిరీస్ తో పాటు..ఆసియా క్రీడలలో పాల్గొనే టీ-20 జట్లలో సైతం సూర్యాకు చోటు దక్కలేదు. ఆసియాకప్ కు అందుబాటులో ఉండటానికి వీలుగా సూర్యకు సెలెక్టర్లు తగిన విశ్రాంతినిస్తూ వస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News