వరుసగా ఆరుహాఫ్ సెంచరీలు, రియాన్ పరాగ్ ప్రపంచ రికార్డు!

ధూమ్ ధామ్ టీ-20క్రికెట్లో మరో యువక్రికెటర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వరుసగా అరడజను హాఫ్ సెంచరీలతో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

Advertisement
Update:2023-10-28 09:06 IST

వరుసగా ఆరుహాఫ్ సెంచరీలు, రియాన్ పరాగ్ ప్రపంచ రికార్డు!

ధూమ్ ధామ్ టీ-20క్రికెట్లో మరో యువక్రికెటర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వరుసగా అరడజను హాఫ్ సెంచరీలతో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

భారత దేశవాళీ క్రికెట్లో మరో టీ-20 ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. అసోం కమ్ రాజస్థాన్ రాయల్స్ యువబ్యాటర్ రియాన్ పరాగ్ ఈ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

అర్థశతకాల 'డబుల్ హ్యాట్రిక్'!

భారత దేశవాళీ టీ-20 క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే సయ్యద్ ముస్తాక్ అలీ -2023 టోర్నీలో భాగంగా ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్ వేదికగా కేరళ- అసోంజట్ల నడుమ జరిగిన లీగ్ పోరులో అరుదైన ప్రపంచ రికార్డు వచ్చి చేరింది.

అసోం యువబ్యాటర్ రియాన్ పరాగ్ 33 బంతుల్లోనే 57 పరుగుల అజేయ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా...టీ-20 ఫార్మాట్లో వరుసగా ఆరుమ్యాచ్ ల్లో అరడజను అర్థశతకాలు బాదిన భారత తొలిబ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతూ వస్తున్న రియాన్ పరాగ్ కు..భారతజట్టులో సభ్యుడిగా అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న అనుభవంసైతం ఉంది.

7 మ్యాచ్ ల్లో 440 పరుగులు..

2023- టీ-20 సీజన్ ను రియాన్ పరాగ్ జోరుగా మొదలు పెట్టాడు. అసోం జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్న రియాన్ స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ తన జట్టు విజయాలలో ప్రధాన పాత్ర వహిస్తున్నాడు.

గ్రూప్ లీగ్ దశలో రియాన్ పరాగ్ ఆడిన ఏడుమ్యాచ్ ల్లో ఏకంగా 440 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. గత ఆరుమ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీలతో అరుదైన ఘనత సాధించాడు.

కేరళతో హోరాహోరీగా సాగిన పోరులో అసోం 2 వికెట్ల విజయం సాధించడంలో రియాన్ కీలక పాత్ర వహించాడు.

ఒడిషాతో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ లో 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించిన రియాన్..ఆ తర్వాతి ఆరు మ్యాచ్ ల్లోనూ మరి వెనుదిరిగి చూసింది లేదు.

బీహార్ పై 34 బంతుల్లో 61 పరుగులు, సర్వీసెస్ పై 37 బంతుల్లో 76 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన రియాన్..సిక్కింపైన 29 బంతుల్లో 53 నాటౌట్, చండీగఢ్ పైన 39 బంతుల్లో 76 పరుగులు, హిమాచల్ ప్రదేశ్ పైన 37 బంతుల్లో 72 పరుగుల స్కోర్లునమోదు చేశాడు. ఇక..పవర్ ఫుల్ కేరళతో జరిగిన కీలక మ్యాచ్ లో రియాన్ 33 బంతుల్లోనే 57 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

దిగ్గజాలను మించిన రియాన్..

టీ-20 క్రికెట్ ఓ టోర్నమెంట్ లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలతో గతంలో ఏడుగురుక్రికెటర్లు నెలకొల్పిన రికార్డును రియాన్ పరాగ్ అధిగమించాడు.

2012 ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. జింబాబ్వే బ్యాటర్ హామిల్టన్ మసకడ్జ 2012 సీజన్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు బాదితే..పాక్ క్రికెటర్ కమ్రన్ అక్మల్ 2017లో లాహోర్ వైట్స్ తరపున 5 హాఫ్ సెంచరీలు సాధించాడు.

2018 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్, 2019 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, 2021 సీజన్లో న్యూజిలాండ్ కు చెందిన స్టార్ హిట్టర్ డేవన్ కాన్వే , 2023 సీజన్లో డెర్బీషైర్ ఆటగాడు వెయిన్ మాడ్సెన్ వరుసగా ఐదేసి హాఫ్ సెంచరీలతో దక్కించుకొన్న ఘనతను రియాన్ పరాగ్ ఆరు వరుస హాఫ్ సెంచరీలతో తెరమరుగు చేయగలిగాడు.

Tags:    
Advertisement

Similar News