సర్ఫరాజ్ ఖాన్ కుటుంబంలోకి కొత్త సభ్యుడు

తండ్రి అయిన సర్ఫరాజ్‌ ఖాన్‌.సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆయన సతీమణి

Advertisement
Update:2024-10-22 08:46 IST

కివీస్‌ టెస్ట్‌తో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇంట్లో మరో సంతోషం నెలకొన్నది. సర్ఫరాజ్‌ తండ్రి అయ్యాడు. ఈ క్రికెటర్‌ సతీమణి సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని సర్ఫరాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. బిడ్డను ఎత్తుకున్న ఫొటోలను పంచుకున్నాడు. దీంతో నెటీజన్లు అతనికి విషెస్ తెలుపుతున్నారు.

సర్ఫరాజ్‌కు గత ఏడాది ఆగస్టులో రోమానా జహూర్‌తో వివాహమైంది. ఈ ఏడాది ప్రారంభంలో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన ఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌తో అతను టీమిండియా జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం విదితమే. ఆ మ్యాచ్‌కు ముందు కుటుంటసభ్యుల సమక్షంలో భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే నుంచి సర్ఫరాజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఆ టైంలో అతని భార్య రోమానా, తండ్రి, కోచ్‌ అయిన నౌషద్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఇక.. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ లో తొలి ఇన్సింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్సింగ్స్‌లో 150 రన్స్‌తో జట్టును ఇన్సింగ్స్‌ పరాజయం నుంచి తప్పించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 26 ఏళ్ల ముంబాయి కుర్రాడు తీవ్రమైన ఒత్తిడిలోనూ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడి భారత క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు. 

Tags:    
Advertisement

Similar News