బెంగళూరు ఓపెనర్లా...మజాకానా!

బెంగళూరు ఓపెనింగ్ జోడీ ఐపీఎల్ -16 లో 1000 పరుగుల రికార్డు నెలకొల్పారు. అత్యంత విజయవంతమైన ఓపెనర్ల జంటగా నిలిచారు.

Advertisement
Update:2023-05-19 17:55 IST

బెంగళూరు ఓపెనర్లా...మజాకానా!

బెంగళూరు ఓపెనింగ్ జోడీ ఐపీఎల్ -16 లో 1000 పరుగుల రికార్డు నెలకొల్పారు. అత్యంత విజయవంతమైన ఓపెనర్ల జంటగా నిలిచారు...

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బలమంతా ఆజట్టు ఓపెనింగ్ జోడీ ( విరాట్ కొహ్లీ- పాఫ్ డూప్లెసీ )లోనే ఉందని గణాంకాలే చెబుతున్నాయి. ప్రస్తుత 16వ సీజన్లో ఆడిన 13 మ్యాచ్ ల్లోనే వెయ్యి పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డు నెలకొల్పారు.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో ముగిసిన 13వ రౌండ్ మ్యాచ్ లో బెంగళూరు ఓపెనర్లు విరాట్- డూప్లెసి మొదటి వికెట్ కు 172 పరుగుల భారీభాగస్వామ్యంతో తమజట్టుకు 8 వికెట్ల సూపర్ చేజింగ్ విజయం అందించారు.

1000 పరుగుల మైలురాయి చేరిన జోడీ..

ఇప్పటి వరకూ ఆడిన 13 మ్యాచ్ ల్లోనే బెంగళూరు కెప్టెన్ డూప్లెసీ 631 పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు. అంతేకాదు..అత్యధికంగా 34 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్ గా కూడా నిలిచాడు.

మరోవైపు విరాట్ కొహ్లీ 438 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల వరుస 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ లో తన మొట్టమొదటి శతకం బాదిన విరాట్ కు నాలుగేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ లో ఇదే తొలి సెంచరీ.

2015లో హైదరాబాద్ వేదికగా జరిగిన పోరులో కొహ్లీ 19 బంతుల్లో 44 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా 6 వికెట్లతో తొలివిజయం అందించాడు.

ప్రస్తుత సీజన్ మ్యాచ్ లో కొహ్లీ 100 పరుగులు సాధించడంతో బెంగళూరు 8 వికెట్ల గెలుపుతో రెండో విజయం నమోదు చేయగలిగింది.

హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ లో ఆడిన 12 మ్యాచ్ ల్లో విరాట్ మొత్తం 592 పరుగులతో 59.2 సగటు నమోదు చేశాడు.ఇందులో 4 అర్థశతకాలు, ఓ శతకమూ ఉన్నాయి.

ప్రస్తుత సీజన్లో ముంబై పై 148 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన విరాట్ - డూప్లెసీ జోడీ..హైదరాబాద్ పై 172 పరుగులతో బెంగళూరు తరపున రెండో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.

క్రిస్ గేల్ సరసన విరాట్ కొహ్లీ..

ఐపీఎల్ లో అత్యధికంగా ఆరుశతకాలు బాదిన క్రిస్ గేల్ రికార్డును విరాట్ కొహ్లీ సమం చేయగలిగాడు. హైదరాబాద్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో సన్ రైజర్స్ పై 100 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ఐపీఎల్ లో విరాట్ తన ఆరోశతకం సాధించగలిగాడు. 2016 సీజన్లో అత్యధికంగా నాలుగు సెంచరీలు సాధించిన విరాట్ 5వ సెంచరీని 2019 సీజన్లో నమోదు చేశాడు. మరో నాలుగేళ్ల విరామం తర్వాత 6వ శతకాన్ని ప్రస్తుత 2023 సీజన్లో సొంతం చేసుకోగలిగాడు.

క్రిస్ గేల్, విరాట్ కొహ్లీ చెరో ఆరు సెంచరీలతో సంయుక్త అగ్రస్థానంలో నిలువగా...జోస్ బట్లర్ 5 శతకాలతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రస్తుత 2023 సీజన్లో కొహ్లీ సాధించిన సెంచరీతో మొత్తం ఎనిమిదిమంది బ్యాటర్లు సెంచరీలు సాధించినట్లయ్యింది. హ్యారీ బ్రూక్, వెంకటేష్ అయ్యర్, యశస్వి జైశ్వాల్, ప్రభు సిమ్రాన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, హెన్రిక్ క్లాసెన్, విరాట్ కొహ్లీ శతకాలు సాధించిన బ్యాటర్లుగా నిలిచారు.

Tags:    
Advertisement

Similar News