2024 టీ-20 ప్రపంచకప్ కెప్టెన్ గా రోహిత్ శర్మ!
అమెరికా, కరీబియన్ ద్వీపాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
అమెరికా, కరీబియన్ ద్వీపాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
2014-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు కెప్టెన్, వైస్ -కెప్టెన్ పేర్లను బీసీసీఐ కార్యదర్శి జే షా అధికారికంగా ప్రకటించారు. మరికొద్ది మాసాలలో వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరిగే ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడం ఖాయమన్న విశ్వాసాని బోర్డు కార్యదర్శి వ్యక్తం చేశారు.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడినా...
భారత్ వేదికగా ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ పరాజయం చవిచూసిన వరుసగా 10 విజయాలు సాధించడం ద్వారా అభిమానుల హృదయాలను గెలుచుకొందని, రోహిత్ శర్మ నాయకత్వంలో తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని జే షా తేల్చి చెప్పారు.
భారతజట్టుకు వైస్ కెప్టెన్ గా పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా సేవలు అందిస్తాడని తెలిపారు.
భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ల సమక్షంలోనే బీసీసీఐ కార్యదర్శి..భారత టీ-20 కెప్టెన్, వైస్ కెప్టెన్ల పేర్లను బయటపెట్టారు.
2023 ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిపిన హార్థిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ గా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యానే నాయకత్వం వహించనున్న సంగతితెలిసిందే.
ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్ తో పాటు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ లోనూ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు రన్నరప్ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. గత దశాబ్దకాలంలో ఐసీసీ ప్రపంచకప్ లేని లోటును భారత్ తో పాటు రోహిత్ శర్మ 2024 టీ-20 ప్రపంచకప్ తో పూడ్చుకోవాలని భావిస్తున్నారు.
అమెరికాలోని ఫ్లారిడాతో పాటు..కరీబియన్ ద్వీపాలలోని పలు వేదికలుగా నిర్వహిస్తారు.
తొలిసారిగా 20 జట్లతో టీ-20 ప్రపంచకప్..
2024- టీ-20 ప్రపంచకప్ ను గతంలో ఎన్నడూలేనంతగా మొత్తం 20 జట్లతో తొలిసారిగా నిర్వహించనున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి ఉగాండా, నమీబియాజట్లు ఇప్పటికే అర్హత సాధించాయి.
ప్రపంచకప్ లో తలపడనున్న మొత్తం 20 జట్లలో అప్ఘనిస్థాన్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఓమన్, పాకిస్థాన్, పాపువా న్యూగినియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఉగాండా, అమెరికా ఉన్నాయి.
టెస్టు హోదా కలిగిన జింబాబ్వే టీ-20 ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యింది.
2024 జూన్ 1 నుంచి మూడువారాలపాటు టీ-20 ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహించనుంది.