లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్లకు సింహస్వప్నం అశ్విన్
తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే వికెట్ తీసి 500 వికెట్ల రికార్డు సృష్టించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో టామ్ హార్ట్‌లీ వికెట్ తీసి 250 లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా మరో అరుదై ఘనత సాధించాడు.
భారత జట్టు ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన రాజ్‌కోట్ టెస్ట్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అందులో అశ్విన్ 500 వికెట్ల రికార్డు ఒకటి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్ చరిత్రకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే వికెట్ తీసి 500 వికెట్ల రికార్డు సృష్టించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో టామ్ హార్ట్‌లీ వికెట్ తీసి 250 లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా మరో అరుదై ఘనత సాధించాడు.
ఎడమచేతి వాటం బ్యాటర్లకు సింహస్వప్నం
ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌కు అశ్విన్ అంటే సింహస్వప్నమే. అశ్విన్ ఇప్పటి వరకు తీసిక 501 టెస్ట్ వికెట్లలో 250 లెఫ్ట్ హ్యాండర్లవే. రాజకోట్‌లో హార్ట్‌లీ వికెట్‌తో 250 మార్కు చేరాడు. ఆ తర్వాత అండర్సన్ 217 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రపంచంలో మరే బౌలరూ 200 సార్లు లెప్ట్ హ్యాండర్లను అవుట్ చేయలేదు.
700 వికెట్లకు చేరువలో ఉన్న అండర్సన్ 217సార్లు లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేస్తే అశ్విన్ 501లోనే 250 మందిని అవుట్ చేయడం విశేషం.