రంజీ ట్రోఫీ.. ఒకే ఇన్నింగ్స్‌లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు

కొత్త చరిత్ర సృష్టించిన గోవా బ్యాటర్లు

Advertisement
Update:2024-11-14 15:52 IST

రంజీ ట్రోఫీలో గోవా బ్యాటర్లు కొత్త చరిత్ర సృష్టించారు. ఒకే ఇన్నింగ్స్‌ లో ఏకంగా ఇద్దరు బ్యాట్స్‌మన్లు ట్రిపుల్‌ సెంచరీలు సాధించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌ లో గోవా బ్యాట్స్‌మన్‌ లు కష్యప్‌ బక్లే 269 బంతుల్లో 39 ఫోర్లు రెండు సిక్సర్లతో 300 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచారు. స్నేహల్‌ కౌతాంకర్‌ 215 బంతుల్లో 45 ఫోర్లు 4 సిక్సర్లతో 314 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో గోవా జట్టు 92 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 727 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అంతకుముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో కేవలం 84 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. నలుగురు బ్యాట్స్‌మన్లు డకౌట్‌ అయ్యారు. అర్జున్‌ టెండుల్కర్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌ లోనూ అరుణాచల్‌ ప్రదేశ్‌ బ్యాటర్లంతా కలిసి సెంచరీ మార్క్‌ అందుకోలేకపోయారు. కేవలం 92 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఒకరు బ్యాటింగ్‌ కు దిగలేదు. ఇన్నింగ్స్‌ 551 పరుగుల భారీ తేడాతో ఈ మ్యాచ్‌ లో గోవా ఘన విజయం సాధించింది. రంజీట్రోఫీలో మూడో వికెట్‌ కు అజేయంగా 606 పరుగులు చేసి స్నేహల్‌ కౌతంకర్‌, కశ్యప్‌ బక్లే కొత్త రికార్డు సృష్టించారు. 2016 -17 సీజన్‌ లో స్వప్నిల్‌ సుగాలే, అంకిత్‌ బవానే నెలకొల్పిన 594 పరుగుల భాగస్వామ్యాన్ని వీరిద్దరు బ్రేక్‌ చేశారు.




 


Tags:    
Advertisement

Similar News