క్రికెట్ లో మరో వారసుడు.. సక్సెస్ అవుతాడా..? లేదా..?

దిగ్గజ క్రికెటర్లు వారి కొడుకులను ఆ స్థాయికి తీసుకు రాలేకపోయారు. ఎంట్రీ ఇప్పించగలిగారు కానీ వారి ప్రతిభను చూసి డీలా పడ్డారు. అయితే ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు.

Advertisement
Update:2023-09-24 11:58 IST

వారసులకు రాజకీయాలు, వ్యాపారాలు, సినిమాలు.. కలిసొచ్చినంతగా ఆటలు కలసి రావు. అందులోనూ క్రికెట్, వారసులకు అంతగా కలసి రాదు. భారత క్రికెట్ లో దిగ్గజాల వారసులు పూర్తి నిరాశను మిగిల్చారు. సునీల్ గవాస్కర్, అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్.. ఇలా దిగ్గజ క్రికెటర్లు వారి కొడుకులను ఆ స్థాయికి తీసుకు రాలేకపోయారు. ఎంట్రీ ఇప్పించగలిగారు కానీ వారి ప్రతిభను చూసి డీలా పడ్డారు. అయితే ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. అతడి పేరు సమిత్. ఇండియన్ వాల్ రాహుల్ ద్రావిడ్ కొడుకు.

భారత క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రావిడ్ కి కొన్ని పేజీలున్నాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా సేవలందిస్తున్నాడు ద్రావిడ్. ద్రావిడ్ కొడుకు సమిత్ ప్రస్తుతం కర్నాటక తరపున అండర్ -19 మ్యాచ్ లు ఆడుతున్నాడు. ఇటీవలే వినోద్ మన్కడ్ ట్రోఫీకి సెలక్ట్ చేసిన టీమ్ లో ఫైనల్ లిస్ట్ లో చోటు సంపాదించాడు సమిత్. అక్టోబర్ 12 నుంచి 20 వరకు హైదరాబాద్ లో జరిగే వినోద్ మన్కడ్ ట్రోఫీలో తన సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక్కడ ద్రావిడ్ వారసుడు విజయవంతమైతే.. ఆ నెగెటివ్ సెంటిమెంట్ కి చెక్ పెట్టినట్టే లెక్క.

భారత క్రికెట్ లో వారసుల దండయాత్రలకు కొదవే లేదు. సైఫ్ అలీఖాన్ తండ్రి, తాత అందరూ క్రికెటర్లే. ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ కూడా అప్పట్లో ప్రయత్నాలు చేశాడు. అమర్నాథ్ ఫ్యామిలీలో కూడా క్రికెటర్లు ఉన్నా.. వారికి కాలం కలసి రాలేదు. ఒకరకంగా భారత క్రికెట్లో.. వారసులు సక్సెస్ కాలేదు. అయినా కూడా క్రికెటర్లకు వారసుల్ని తెరపైకి తేవాలన్న ఆశ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ద్రావిడ్ తన కొడుకుని అండర్-19 టీమ్ లో కీలక ప్లేయర్ గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ద్రావిడ్ పేరు కేవలం ఎంట్రీ వరకే పనికొస్తుంది కానీ టీమిండియాలో చోటు దక్కాలంటే మాత్రం కుర్రాడికి ట్యాలెంట్ ఉండాల్సిందే. మరి ఆ టాలెంట్ సమిత్ లో ఉందో లేదో మరికొన్నాళ్లు ఆగితే తేలిపోతుంది. 

Tags:    
Advertisement

Similar News