క్లేకోర్ట్ కింగ్ నాదల్.. చివరి మ్యాచ్‌లో ఫెయిల్
క్టే కోర్ట్‌ను గత 20 ఏళ్లుగా కనుసైగతో శాసిస్తున్న నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టడం విషాదం.
రోలాండ్ గారోస్.. ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించే ఎర్రమట్టి కోర్టు. సంప్రదాయ టెన్నిస్ కోర్టులకు పూర్తి భిన్నంగా ఎర్రమట్టి దుమ్ము రేగే ఈ కోర్టులో టెన్నిస్ ఆడటం ఆషామాషీ కాదు. ద గ్రేట్ ఫెదరర్, పీట్ సంప్రాస్, ఆండ్రీ అగస్సీ లాంటి వారికి కూడా కొరుకుడుపడని రోలాండ్ గారోస్ ఒక్క ఆటగాడికి మాత్రం తలవంచి సలాం కొట్టింది. ఆ ఒక్కడే స్పెయిన్ బుల్.. రఫెల్ నాదల్. క్టే కోర్ట్‌ను గత 20 ఏళ్లుగా కనుసైగతో శాసిస్తున్న నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టడం విషాదం.
2005లో మొదలుపెట్టాడు..
125 సంవత్సరాలుగా రోలాండ్ గారోస్‌లో టెన్నిస్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. అయితే 1958 నుంచే ఓపెన్ శకం ప్రారంభమైంది. ఫ్రెంచ్ ఓపెన్‌కు ఇదే అడ్డాగా మారింది. 66 ఏళ్లుగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ మాదిరిగా శాసించినఆటగాడు లేడు. 2005లో తొలిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన ఈ స్పెయిన్ ఆటగాడు.. ఎర్రమట్టి కోర్టును తన కోటగా మార్చుకున్నాడు.
19 ఏళ్లలో 14 సార్లు అతనే విజేత
2005 నుంచి 19సార్లు ఫ్రెంచ్ ఓపెన్ జరిగితే అందులో 15సార్లు నాదలే ఛాంపియన్. ఈ లెక్కలు చాలు రోలాండ్ గారోస్‌లో అతనిఆధిపత్యం చాటడానికి.. 2005 నుంచి 2014 వరకు 10 సార్లు టోర్నీలు జరిగితే అందులో 9ఏళ్లు నాదల్‌ను కొట్టిన మగాడే లేడు. తర్వాత మధ్యలో రెండేళ్లు గ్యాప్ వచ్చినా తర్వాత 5సార్లు ట్రోఫీ ఎత్తాడు.
కప్పు కొరికే ఆ సీన్ ఇంక చూడలేం|
నాదల్ ప్రెంచి ఓపెన్ గెలవడం, ఆ కప్పును కొరుకుతూ అతను ఫొటోలకు ఫోజులివ్వడం.. రెండు దశాబ్దాలుగా చూస్తున్న అతని అభిమానులకు చేదువార్త. ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో నిన్న తొలి మ్యాచ్లోనే అతను ఇంటిముఖం పట్టాడు. ఇక తాను ఫ్రెంచ్ ఓపెన్ ఆడటం చాలా చాలా కష్టమని ఆయన ఇప్పటికే ప్రకటించాడు. ఈ లెక్కన చూస్తే క్లే కోర్ట్ కింగ్ నాదల్.. చివరి మ్యాచ్‌లో ఫెయిలయ్యాడని ఒప్పుకోవాల్సిందే.