ప్రో-కబడ్డీ లీగ్ సీజన్ -10 ఫైనల్స్ వేదికగా హైదరాబాద్!

దేశంలోని వివిధ నగరాలలో సందడి చేస్తున్న ప్రో-కబడ్డీ లీగ్ హంగామా మరోసారి హైదరాబాద్ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేయనుంది.

Advertisement
Update:2024-02-04 07:45 IST

దేశంలోని వివిధ నగరాలలో సందడి చేస్తున్న ప్రో-కబడ్డీ లీగ్ హంగామా మరోసారి హైదరాబాద్ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేయనుంది. సీజన్ -10 ప్లేఆఫ్, ఫైనల్స్ మ్యాచ్ లను గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు.

భారతగడ్డపై అత్యధిక జనాదరణ పొందుతున్న రెండో అతిపెద్ద లీగ్ ప్రీమియర్ కబడ్డీ 10వ సీజన్ మలి అంచె హంగామా కోసం హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది.

వారంరోజుల సందడి....

దేశంలోని ముంబై, జైపూర్, బెంగళూరు, కోల్ కతా, న్యూఢిల్లీ, కోల్ కతా, అహ్మదాబాద్, లక్నో లాంటి పలు మేటి నగరాలలో సందడి సందడి చేసిన 90 మ్యాచ్ ల ప్రో-కబడ్డీలీగ్ 10వ సీజన్ పోటీల ఆఖరి అంచెకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.

దేశంలోని పలు నగరాలు వేదికగా 12జట్లతో తొలిదశ లీగ్ పోటీలను నిర్వహిస్తే..మలిదశలో భాగంగా జరిగే ప్లే-ఆఫ్స్ తో పాటు టైటిల్ సమరాన్ని హైదరాబాద్ లోని గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకూ నిర్వహించనున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

మొదటి 2 జట్లకు నేరుగా సెమీ ఫైనల్స్ కు అర్హత...

మొత్తం 12 జట్ల లీగ్ దశలో మొదటి రెండుస్థానాలలో నిలిచిన రెండుజట్లు నేరుగా సెమీఫైనల్స్ కు చేరుకొంటాయి. 3, 4, 5,6 స్థానాలలో నిలిచిన జట్ల నడుమ మిగిలిన రెండు సెమీస్ బెర్త్ ల కోసం ఎలిమినేటర్ రౌండ్ పోటీలు నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 27న జరిగే ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ తో హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 28న రెండు సెమీఫైనల్స్ రౌండ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.

మార్చి 1న చాంపియన్ జట్టు ఏదో నిర్ణయించే ఫైనల్స్ జరుగుతుంది.

ఎలిమినేటర్ -1 పోరులో 3వ స్థానంలో నిలిచినజట్టుతో 6వ స్థానం సాధించిన జట్టు, ఎలిమినేటర్ -2 ఫైట్ లో 4, 5 స్థానాలలో నిలిచిన జట్లు తలపడనున్నాయి.

ఎలిమినేటర్ -1 విజేతగా నిలిచినజట్టు తొలిసెమీఫైనల్లో టేబుల్ టాపర్ జట్టుతోను, ఎలిమినేటర్ -2 రౌండ్ మ్యాచ్ విజేతతో లీగ్ రన్నరప్ జట్టు రెండో సెమీఫైనల్లో ఢీ కొంటాయి.

సీజన్ -10 మ్యాచ్ లకు విశేషఆదరణ..

ప్రస్తుత 2024 సీజన్ ప్రో-కబడ్డీలీగ్ మ్యాచ్ లకు విశేషఆదరణ దక్కిందని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి ప్రకటించారు. గత తొమ్మిది సీజన్ల లీగ్ కు మించి టీవీ వీక్షకుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మొత్తం 12 జట్లు అత్యున్నత ప్రమాణాలతో ఆడుతున్న కారణంగానే లీగ్ విజయవంతమయ్యిందని వివరించారు.

ఐపీఎల్ తరువాత దేశంలో అత్యధిక టీవీ రేటింగ్ కలిగిన లీగ్ ప్రో- కబడ్డీ లీగ్ మాత్రమేనని ప్రకటించారు.

10వ సీజన్ లీగ్ 2023 డిసెంబర్ 2 నుంచి దేశంలోని 12 నగరాలు వేదికలుగా 12 జట్లతో నిర్వహిస్తున్నారు.

లీగ్ లో తలపడుతున్న మొత్తం 12 జట్లలో జైపూర్ పింక్ పాంథర్స్, యూ-ముంబా, పూణేరీ పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్, గుజరాత్ జెయింట్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, తమిళ్ తలైవాస్, యూపీ యోధాస్, తెలుగు టైటాన్స్ ఉన్నాయి.

తెలుగు రాష్ట్ర్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగు టైటాన్స్ 12జట్ల లీగ్ టేబుల్ అట్టడుగున కొట్టిమిట్టాడుతోంది.

Tags:    
Advertisement

Similar News