సెంచరీతో ఫిల్ సాల్ట్ అరుదైన ఫీట్
వెస్టిండిస్‌తో ఐదు టీ20 సిరీస్‌లో 53 బాల్స్‌లోనే సెంచరీ కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ అద్భుత సెంచరీతో వెస్టిండిస్‌పై మెరిశాడు. 53 బాల్స్‌లోనే సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య ఛేధనలో ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో విజయం సాధించింది. ఓపెనర్ విల్ జాక్స్ (17)తో కలిసి మొదటి వికెట్‌కు ఫిల్ సాల్ట్ (103 నాటౌట్.. ఇందులో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి)73 రన్స్ జోడించాడు. అయితే, జాక్స్‌తో పాటు కెప్టెన్ జోస్ బట్లర్(0) వెనువెంటనే ఔట్ చేయడం మినహా విండీస్‌కు మరే సంతోషం దక్కలేదు. జాకబ్ బెతెల్ (58 నాటౌట్) తో కలిసి మూడో వికెట్‌కు 107 రన్స్ జోడించిన సాల్ట్ ఇంగ్లండ్ జట్టును గెలుపు తీరాలకు తీసుకెళ్లాడు. దీంతో ఐదు టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంతో దూసుకెళ్లింది.
టీ 20 కెరీర్‌లో సాల్ట్‌కు ఇది మూడో సెంచరీ. అయితే ఈ మూడు సెంచరీలూ విండీస్‌పైనే చేయడం గమనార్హం. ఇలా పొట్టి ఫార్మాట్‌లో అన్ని సెంచరీలను ఒకే జట్టుపై సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 34 ఇంటర్నేషనల్ టీ 20 మ్యాచ్‌లే ఆడిన సాల్ట్ మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 119 రన్స్. వరుసగా రెండు మ్యాచుల్లోనూ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ఉన్నాడు. విండీస్‌పై 2023 డిసెంబర్ 16, 19న జరిగిన రెండు టీ 20ల్లో సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ (భారత్‌పై), విండీస్ బ్యాటర్ ఇవిన్ లూయిస్ (భారత్‌పై), యూఏఈ ప్లేయర్ మహ్మద్ వసీమ్ (ఐర్లాండ్‌పై), సెర్బియా ఆటగాడు లెస్లీ డన్బార్ (బల్గేరియాపై) ఒకే జట్టుపై రెండు సెంచరీలు సాధించారు.