ఓటమి ఆక్రోషాన్ని భారత జర్నలిస్టుపై చూయించిన పాక్ క్రికెట్ బోర్డు చీఫ్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ రమీజ్ రాజా భారత జర్నలిస్టుమీద విరుచుకపడ్డాడు. ఆసియాకప్ ఫైనల్ లో శ్రీలంక చేతిలో పాక్ ఓటమి తర్వాత ఈ సంఘటన జరిగింది.

Advertisement
Update:2022-09-12 16:43 IST

ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయాక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ తన ఆక్రోషాన్ని ఓ భారత జర్నలిస్టుపై వెళ్ళగక్కాడు.

ఓటమి అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ర‌మీజ్ రాజా ను జర్నలిస్టులు పలకరించారు. ఓటమికి కారణాలను అడిగారు. ఈ ఓటమిపై పాక్ క్రికెట్ అభిమానులు నిరాశ చెంది ఉంటారు కదా అని భారత్ కు చెందిన జర్నలిస్టు రోహిత్ జుల్గన్ ప్రశ్నించారు. అసలే ఓటమి మంటతో ఉన్న‌ రమీజ్ రాజాకు జర్నలిస్టు ప్రశ్న తో మరింత మండుకొచ్చింది. మీది ఇండియానా అని ప్రశ్నించి, మీరు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు కదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయితే అలాంటిదేమీ లేదు, తాను వేసింది నిజ‌మైన ప్ర‌శ్నే అని జ‌ర్న‌లిస్టు స‌మాధానం ఇవ్వ‌డంతో ర‌మీజ్ మ‌రింత అస‌హ‌నానికి లోన‌య్యాడు. ర‌మీజ్ అక్క‌డ నుంచి వెళ్లిపోతూ.. జ‌ర్న‌లిస్టు ఫోన్‌ను నెట్టివేశాడు.

దీనిపై ట్విట్టర్ లో స్పంధించిన జర్నలిస్టు రోహిత్ జుల్గన్, ''నా ప్రశ్న తప్పా - పాకిస్తాన్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారా అని అడగడం తప్పవుతుందా ? మీరు చేసింది చాలా తప్పు - ఒక బోర్డు ఛైర్మన్‌గా - మీరు నా ఫోన్‌ని లాక్కోకూడదు. చైర్మన్ గారూ అది సరైందికాదు.'' అని అన్నారు.



Tags:    
Advertisement

Similar News