ఏటీపీ టూర్ ఫైనల్స్ లో జోకోవిచ్ డబుల్ హ్యాట్రిక్

ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ 2022 సీజన్ ను గొప్పవిజయంతో ముగించాడు. స్విస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న అరుదైన రికార్డును సమం చేశాడు.

Advertisement
Update:2022-11-21 13:27 IST

ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ 2022 సీజన్ ను గొప్పవిజయంతో ముగించాడు. స్విస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న అరుదైన రికార్డును సమం చేశాడు.

సెర్బియన్ థండర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ 2022 సీజన్ ప్రారంభంలో చేదుఅనుభవాలు ఎదుర్కొన్నా..సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ టూర్ ఫైనల్స్ లో టైటిల్ నెగ్గడం ద్వారా సంతృప్తిగా ముగించాడు.

ట్యూరిన్ వేదికగా జరిగిన 2022 ఏటీపీ టూర్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లో నొవాక్ జోకోవిచ్ 7-5, 6-3తో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ ను ఓడించడం ద్వారా విజేతగా నిలిచాడు.

35 సంవత్సరాల జోకోవిచ్ కరోనా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా రెండు గ్రాండ్ స్లామ్ టోర్నీలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కేవలం ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.

టాప్ ర్యాంక్ ఆటగాళ్ల కోసమే నిర్వహించే సీజన్ ముగింపు టోర్నీలో జోకోవిచ్ నిలకడగా రాణిస్తూ వరుస విజయాలతో ఫైనల్ చేరాడు. టైటిల్ సమరంలో సైతం కాస్పర్ రూడ్ ను అధిగమించడం ద్వారా తన కెరియర్ లో ఆరోసారి ట్రోఫీ అందుకొన్నాడు. గతంలో ఇదే ఘనత సాధించిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న ఆరు ఏటీపీ టూర్ ఫైనల్స్ రికార్డును సమం చేయగలిగాడు.

47 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ సొంతం..

జోకోవిచ్ ట్రోఫీతో పాటు 47 లక్షల డాలర్ల భారీ ప్రైజ్ మనీ చెక్ ను అందుకొన్నాడు. ఏడేళ్ల విరామం తర్వాత ఏటీపీ టూర్ ముగింపు టైటిల్ ను జోకోవిచ్ గెలుచుకోడం విశేషం.

ప్రస్తుత సీజన్లో కేవలం వింబుల్డన్ టైటిల్ మాత్రమే నెగ్గిన జోకోవిచ్ ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్ సాధించడం ద్వారా 5వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు కాస్పర్ రూడ్ కు మరోసారి టైటిల్ పోరులో ఓటమి తప్పలేదు. ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్, అమెరికన్ ఓపెన్ టోర్నీల ఫైనల్స్ లో పరాజయం పొందిన రూడ్...ఏటీపీ టూర్ ఫైనల్స్ ఫైనల్లోనూ ఓటమి పొందిక తప్పలేదు.

అమెరికాకు చెందిన రాజీవ్ రామ్- బ్రిటన్ ఆటగాడు జో సాలిస్ బరీల జోడీ ఏటీపీ టూర్ డబుల్స్ టైటిల్ గెలుచుకొన్నారు.

మెల్బోర్న్ వేదికగా జనవరి మూడోవారంలో ప్రారంభమయ్యే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తో 2023 గ్రాండ్ స్లామ్ సీజన్ ప్రారంభంకానుంది.

Tags:    
Advertisement

Similar News