ఆసీస్ గడ్డపై నితీశ్ సిక్సర్ల రికార్డు
ఒకే సిరీస్ లో ఎనిమిది సిక్సులు కొట్టిన నితీశ్
Advertisement
మెల్‌బోర్న్ టెస్టులో ఆపదలో ఉన్న టీమిండియాను తన అద్భుత సెంచరీతో ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సిక్సర్లు కొట్టి తొలి భారతీయ బ్యాట్స్‌మన్ గా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. మెల్‌బోర్న్ టెస్ట్ లో కొట్టిన సిక్స్ తో బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ బాదిన సిక్సర్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన మరో రికార్డు కూడా శనివారం నితీశ్ పేరిట నమోదు అయ్యింది. గతంలో అనిల్ కుంబ్లే 87 పరుగులతో ఉన్న రికార్డును నితీశ్ 105 పరుగులతో అధిగమించాడు.
Advertisement