మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన నితీశ్‌ రెడ్డి

దీనికి సంబంధించి వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశాడు.

Advertisement
Update:2025-01-14 09:28 IST

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీతో టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి తొలి టోర్నీలోనే అద్భుతంగా ఆడాడు. సిక్సర్ల మోత మోగించి సెంచరీతో అందరినీ ఆకట్టుకునే సంగతి తెలిసిందే. తాజాగా అతను తిరుమలకు వెళ్లాడు. మెట్ల మార్గంలో వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశాడు. మోకాళ్ల పర్వతం వద్ద నితీశ్‌ మోకాళ్లపై మెట్లెక్కాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి

Tags:    
Advertisement

Similar News