కమాన్‌.. ఇప్పుడు అరవండి

కొన్‌స్టాస్‌ను క్లీన్‌ బోల్డ్‌ చేసినప్పుడు బూమ్రా ఫ్యాన్స్‌కు సైగలు

Advertisement
Update:2024-12-29 07:48 IST

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా-భారత్‌ జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ నాలుగో రోజు ఆసీస్‌ రెండో ఇన్సింగ్స్‌లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకున్నది.మొదటి ఇన్నింగ్స్‌లో యువ ఆటగాడు కొన్‌స్టాస్‌ దూకుడుగా ఆడి హాఫ్‌ సెంచరీ చేసిన విషయం విదితమే. మరీ ముఖ్యంగా భారత స్టార్‌ పేసర్‌ జస్‌ ప్రీత్‌ బూమ్రా బౌలింగ్‌లో ఎదురుదాడి చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ వీరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు భావించారు. కానీ సీనియర్ పేసర్‌ ముందు ఆసీస్‌ యువ ఆటగాడు నిలువలేకపోయాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో అద్భుతమైన బాల్‌తో కొన్‌స్టాస్‌ను బూమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో బూమ్రాతో పాటు భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఇంకా అరవాలంటూ కొన్‌స్టాస్‌ ఫ్యాన్స్ ను ఎంకరేజ్‌ చేశాడు. అదే తరహాలో కొన్‌స్టాస్‌ ఔటైనప్పుడు బూమ్రా కూడా అభిమానులకు సైగలు చేయడం గమనార్హం. ఇప్పుడీ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Tags:    
Advertisement

Similar News