టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌

రెండో టెస్ట్‌ తుది జట్టులో మూడు మార్పులు చేసిన టీమిండియా

Advertisement
Update:2024-10-24 10:59 IST

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్‌లో ఓటమి తర్వాత పూణె వేదిక రెండో మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. నాలుగో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టమని భావించిన కివీస్‌ కెప్టెన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. ఈటెస్ట్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు నిలుస్తాయి. అందుకే రెండో టెస్ట్‌ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ను పక్కనపెట్టి స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు చోటు కల్పించింది. అలాగే మొదటి టెస్ట్‌లో పెద్దగా ప్రభావం చూపెట్టని కేఎల్‌ రాహుల్‌, సిరాజ్‌కు బదులు గిల్‌, అకాశ్‌దీప్‌ జట్టులోకి తీసుకున్నది. అదేసమయంలో కివీస్‌ కూడా జట్టులో ఓ మార్పు చేసింది. పేసర్‌ హెన్రీని పక్కనపెట్టేసి మిచెల్‌ సాంట్నర్‌ను తీసుకున్నది. టీమిండియా తుది జట్టులో మూడు మార్పులు చేయడంపై సునీల్‌ గవాస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఆందోళన పడుతున్నదని అనడానికి ఇదే నిదర్శనమన్నాడు.

తుది జట్లు

టీమిండియా. రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషభ్‌పంత్‌ (కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అకాశ్‌దీప్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా

కివీస్‌: టామ్‌ లేథమ్‌ (కెప్టెన్‌), డేవన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, టామ్‌ బ్లండెల్‌ (కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, టిమ్‌ సౌథీ , అజాజ్‌ పటేల్‌, విలియమ్‌ ఓరోర్కీ

Tags:    
Advertisement

Similar News