ప్రపంచకప్ హాకీలో రికార్డుల మోత!

Hockey World Cup records 2023: 2023 ప్రపంచ పురుషుల హాకీ టోర్నీలో గోల్స్ జోరు, రికార్డుల హోరుతో సాగిపోతోంది. మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ 13 సంవత్సరాల ప్రపంచ రికార్డును తెరమరుగు చేసింది.

Advertisement
Update:2023-01-21 11:00 IST

2023 ప్రపంచ పురుషుల హాకీ టోర్నీలో గోల్స్ జోరు, రికార్డుల హోరుతో సాగిపోతోంది. మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ 13 సంవత్సరాల ప్రపంచ రికార్డును తెరమరుగు చేసింది...

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ప్రపంచకప్ హాకీ పురుషుల టోర్నీ సంచలన విజయాలు, ప్రపంచ రికార్డులు, గోల్స్ వర్షంతో సాగిపోతోంది. 16జట్ల ఈపోరు తొలిదశ గ్రూపులీగ్ పోటీలలో ఏకంగా ఐదు హ్యాట్రిక్ లు, ఓ ప్రపంచ రికార్డు నమోదయ్యాయి.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం, రూర్కెలా బిర్సాముండా స్టేడియం వేదికలుగా జరుగుతున్న ఈ పోరు నాలుగు గ్రూపుల్లో రెండు గ్రూపుల నుంచి డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, మూడుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించాయి.

పూల్-ఏ నుంచి ఆస్ట్ర్రేలియా, పూల్-బీ నుంచి బెల్జియం నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించగా..పూల్- డీ నుంచి ఇంగ్లండ్ క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. ఆతిథ్య భారత్ మాత్రం పూల్ - డీ రన్నర్ గా క్రాస్ ఓవర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడించగలిగితేనే క్వార్టర్స్ చేరుకోగలుగుతుంది.

క్సాస్ ఓవర్ పోరుకు అర్జెంటీనా, ఫ్రాన్స్..

క్వార్టర్ ఫైనల్స్ కు అర్హతగా నిర్వహిస్తున్న క్రాస్ ఓవర్ రౌండ్ కు అర్జెంటీనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, దక్షిణ కొరియా చేరుకొన్నాయి. పోటీల ఏడోరోజున జరిగిన ఆఖరిరౌండ్ పోటీలలో రికార్డుస్థాయిలో నాలుగు హ్యాట్రిక్ లు నమోదయ్యాయి.

ఫ్రాన్స్ , అర్జెంటీనా జట్ల పోరులో రెండు, ఆస్ట్ర్రేలియా, బెల్జియం మ్యాచ్ ల్లో మరో రెండు హ్యాట్రిక్ లు నమోదుకావడం విశేషం.

ఆస్ట్ర్రేలియా ఆటగాడు బ్లాకే గోవర్స్, ఫ్రెంచ్ ప్లేయర్ విక్టర్ చార్లెట్, అర్జెంటీనా స్టార్ నికోలస్ డెల్లా టోరో, బెల్జియం ప్లేయర్ టామ్ బూన్, జర్మన్ హిట్టర్ నిక్లాస్ వెల్లెన్ హ్యాట్రిక్ లు నమోదు చేసిన ఆటగాళ్లలో ఉన్నారు.

ఆఖరిరౌండ్ నాలుగుమ్యాచ్ ల్లో 38 గోల్స్ నమోదయ్యాయి. మ్యాచ్ కు 9.5 గోల్స్ చొప్పున నమోదు కావడం మరో రికార్డు.

నెదర్లాండ్స్ సరికొత్త ప్రపంచ రికార్డు..

మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ తన గ్రూపు పోటీలో 14 గోల్స్ విజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 13 సంవత్సరాల క్రితం నమోదైన 13 గోల్స్ రికార్డును నెదర్లాండ్స్ ప్రస్తుత టోర్నీలో అధిగమించింది.

ఇతర పోటీలలో ఆస్ట్ర్రేలియా 9-2 గోల్స్ తో దక్షిణాఫ్రికాను చిత్తు చేయగా అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్ల పోరు 5-5 గోల్స్ తో డ్రాగా ముగిసింది.

మరోపోటీలో బెల్జియం 7-1 గోల్స్ తో జపాన్ ను, జర్మనీ 7-2 గోల్స్ తో దక్షిణ కొరియాను చిత్తు చేశాయి.

Tags:    
Advertisement

Similar News