మాతోని కాదు.. మా దేశం పోతాం.. సెమీస్ రేసులో పాకిస్థాన్‌కు అసాధ్యమైన టాస్క్
సెమీస్‌కు పాక్ క్వాలిఫై కావాలంటే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను 13కు ఆలౌట్ చేయాలి. ఇది అసలు జరిగే పనేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రపంచకప్‌లో భారత్, పాక్ మళ్లీ పోరాడితే చూడాలనుకుంటున్నారా? సెమీస్‌లో ఇండియా, పాక్ ఎపిక్ మ్యాచ్ కోసం ఆశపడుతున్నారా? సవాలే లేదు. పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ ఆడటం జస్ట్ ఇంపాజిబుల్ అంతే. ఎందుకంటే ఇంగ్లాండ్‌తో ఆ జట్టు ఆడబోయే మ్యాచ్‌లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు ముడిపడి ఉన్నాయి. ఆ ఈక్వేషన్ చూస్తే ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ మీద కదా.. మన ఇంటి వెనకాల ఆడే పిల్ల టీమ్‌తో కూడా పాకిస్థాన్ ఆ సమీకరణాన్ని చేధించలేదు. అందుకే పాకిస్థాన్ ఆటగాళ్లు మేం పోతాం మా దేశానికి అన్నట్లుగా సోషల్ మీడియాలో మీమ్స్ చెలరేగిపోతున్నాయి.
300 కొట్టి.. 13కు ఆలౌట్ చేయాలి
సెమీస్‌కు పాక్ క్వాలిఫై కావాలంటే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేస్తే 300 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను 13కు ఆలౌట్ చేయాలి. 400 కొడితే 112కు, 450 కొడితే 162కు, 500 కొడితే 211కు ఆలౌట్ చేయాలట. ఇది అసలు జరిగే పనేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంకో దారి కూడా ఉంది!
ఒకవేళ ఇంగ్లాండ్ ముందు బ్యాటింగ్ చేసినా పాకిస్థాన్‌కు ఛాన్స్ ఉంది. అదేంటో తెలుసా.. ఇంగ్లిష్ జట్టును 150కి ఆలౌట్ చేయాలి. ఆగండాగండి అక్కడితో అయిపోలేదు. ఆ 151 రన్స్ టార్గెట్‌ను పాక్ 3.4 ఓవర్లలో చేధించాలి. అంటే 22 బంతుల్లో.. బంతికో సిక్స్ కొట్టినా 144 దగ్గర బండి ఆగిపోతుంది. కాబట్టి పాక్ పనైపోయింది.. ఇక ఫ్లైట్ ఎక్కేయడమే అని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
♦