మళ్లీ మెరిసిన మను.. ఈసారి సరికొత్త చరిత్ర

ప్యారిస్ ఒలింపిక్స్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఇది వరకే కాంస్య పతకం గెలిచిన మను, ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో నూ కాంస్యం సాధించింది.

Advertisement
Update: 2024-07-30 08:19 GMT

భారత ఒలింపిక్ చరిత్రలో మను బాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే సీజన్ లో రెండు పతకాలు గెలిచిన క్రీడారిణిగా ఆమె సంచలనం నమోదు చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఇది వరకే కాంస్య పతకం గెలిచిన ఆమె, ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో నూ కాంస్యం సాధించింది. దీంతో ఆమె పతకాల సంఖ్య రెండుకి చేరింది. ఒలింపిక్స్ లో ఒకేసారి రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా 'మను' చరిత్ర సృష్టించింది.


మను బాకర్, సరబ్ జోత్ సింగ్… వీరిద్దరూ కలసి మిక్స్ డ్ టీమ్ విభాగంలో పతకం గెలిచారు. మను బాకర్‌ జోడీ 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ద్వయం (లీ-యెజిన్‌) 10 పాయింట్లు సాధించింది. దీంతో మను, సరబ్ జోత్ సింగ్ కాంస్యం దక్కించుకున్నారు.

గతంలో భారత క్రీడాకారులు రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన ఉదాహరణలున్నాయి. తెలుగమ్మాయి పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం దక్కించుకుంది. కానీ ఒకేసారి ఒకే ఒలింపిక్ లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా మను బాకర్ రికార్డ్ సృష్టించింది. 

Tags:    
Advertisement

Similar News