వెంకటేశ్ అయ్యర్ కు కోల్‌కతా షాక్!
కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ ను పరిగణలోకి తీసుకోని మేనేజ్‌మెంట్
ఐపీఎల్ మెగా వేలంలో థర్డ్ హయ్యెస్ట్ ప్రైస్ కోట్ చేసి స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ను దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ టోర్నీ ప్రారంభానికి ముందే ఆయనకు షాక్ ఇవ్వబోతుంది. అన్ని కోట్లు పోసి కొన్న ప్లేయర్ కు షాక్ ఇవ్వడం ఏమిటి అనుకుంటున్నారా? నిరుడు ఐపీఎల్ ట్రోఫీని కోల్‌కతానే గెలుచుకుంది. అప్పుడు టీమ్ ను లీడ్ చేసిన శ్రేయస్ అయ్యర్ ను టీమ్ రిటైన్ చేసుకోలేదు. శ్రేయస్ కు భారీగా ధర పోసి పంజాబ్ కింగ్స్ లెవన్ కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు కోల్‌కతా కెప్టెన్ ఎవరు అనే చర్చ మొదలైంది. సాధారణంగా భారీగా ధర (రూ.23.75 కోట్లు) పెట్టి కొన్న వెంకటేశ్ కే జట్టు పగ్గాలు అప్పగిస్తారని అందరూ అనుకుంటారు. వెంకటేశ్ అయ్యర్ సైతం తాను కెప్టెన్సీ రేసులో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు కూడా. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకోలా ఆలోచిస్తోందట. వెంకటేశ్ అయ్యర్ బ్యాట్ మెరుపులు మాత్రమే ఆస్వాదించాలని టీమ్ మేనేజ్‌మెంట్ అనుకుంటుందట. అందుకే బేస్ ప్రైస్ రూ.1.50 కోట్లకు సొంతం చేసుకున్న సీనియర్ ప్లేయర్ అంజిక్యా రహానేకు కెప్టెన్సీ ఇవ్వబోతుందట. తాను కెప్టెన్సీకి సిద్ధమని వెంకటేశ్ చెప్పిన తర్వాత కూడా ఆయనకు ఆ బాధ్యతలు ఇవ్వడానికి టీమ్ మేనేజ్‌మెంట్ ఇష్టపడలేదు అంటే అది అయ్యర్ కే కాదు ఆయన అభిమానులకు నిజంగా షాకింగ్ న్యూసే.