సచిన్ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డు
ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ మరో ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ (1630) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండుల్కర్ (1625) పేరిట ఉండేది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో రూట్ 23 రన్స్ చేసి ఈ ఫీట్ సాధించాడు. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకోగా.. జో రూట్ కేవలం 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు 150 టెస్టులు ఆడిన అతను.. 12,777 రన్స్ చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం 155/6 స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్.. 254 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. డారిల్ మిచెల్ (84), పదో వికెట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 104 రన్స్ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 12.4 ఓవర్లలోనే ఛేదించింది. జాకబ్ బెథెల్ (50 నాటౌట్), బెన్ డకెట్ (27), జో రూట్ (23 నాటౌట్) రన్స్ చేశారు.
టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే
జో రూట్ -1630 (49 ఇన్నింగ్స్)
సచిన్ -1625 (60 ఇన్నింగ్స్)
గ్రేమ్ స్మిత్ - 1611 (41 ఇన్నింగ్స్)
అలిస్టర్ కుక్ - 1611 (53 ఇన్నింగ్స్)
చందర్‌పాల్-1580 (49 ఇన్నింగ్స్)