ఐపీఎల్ మినీ వేలానికి 68 మంది స్టార్ క్రికెటర్లు!

టీ-20 ప్రపంచకప్ ముగిసేందో లేదో ఐపీఎల్ 2023 సీజన్ కు మెల్లగా వేడి రాజుకొంటోంది. మినీవేలానికి మొత్తం 10 ఫ్రాంచైజీలు తమతమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి.

Advertisement
Update:2022-11-16 10:21 IST

ఐపీఎల్ మినీ వేలానికి 68 మంది స్టార్ క్రికెటర్లు!

టీ-20 ప్రపంచకప్ ముగిసేందో లేదో ఐపీఎల్ 2023 సీజన్ కు మెల్లగా వేడి రాజుకొంటోంది. మినీవేలానికి మొత్తం 10 ఫ్రాంచైజీలు తమతమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి.

తమకు అవసరం లేని ఆటగాళ్లను వివిధజట్లు వదులుకోడంతో...మొత్తం 68 ప్రధాన క్రికెటర్లు వేలం పరిథిలోకి రాగలిగారు...

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన టీ-20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2023 సీజన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. భారత్ వేదికగా మరో ఆరుమాసాలలో జరుగనున్న ఈ లీగ్ మినీ వేలానికి ముందే..మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టేపెట్టుకొని, అవసరం లేని వారిని వదులుకొన్నాయి.

ముంబై సరికొత్త రికార్డు..

ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ గతసీజన్లో తమజట్టుకు ఆడిన 13 మంది ఆటగాళ్లను విడిచి పెట్టింది. రోహిత్ శర్మ నాయకత్వంలో సరికొత్త జట్టును తయారు చేసుకోడానికి మార్గం సుగమం చేసుకొంది.

ఆల్ టైమ్ గ్రేట్ ఆల్ రౌండర్ కీరాన్ పోలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో తమ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్ గా నియమించుకొంది. ముంబై వదులుకొన్న మిగిలిన 11మంది ఆటగాళ్లలో డేనయిల్ సామ్స్, ఫేబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రీలే మెర్డిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్, బాసిల్ థంపీ, అన్ మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన జుయాల్ ఉన్నారు.

అర్జున్ టెండుల్కర్ కొనసాగింపు...

సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ముంబైజట్టుతోనే కొనసాగనున్నాడు. సీజన్ కు 30 లక్షల రూపాయల కాంట్రాక్టుపై చేరిన అర్జున్ కు ఇప్పటి వరకూ ఒక్కమ్యాచ్ లోనూ ఆడే అవకాశం దక్కలేదు.

ముంబై ఫ్రాంచైజీ కొనసాగించనున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, రమణ్ దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టాన్ స్టబ్స్, డేవిడ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ ప్రీత్ బుమ్రా, అర్షద్ ఖాన్, కుమార కార్తికేయ, హృతిక్ షౌకీన్, జేసన్ బెహ్రెన్ డోర్ఫ్, ఆకాశ్ మద్వాల్ ఉన్నారు.

విదేశీ క్రికెటర్ల కోటాలో ముంబైజట్టులో మూడు బెర్త్ లు ఖాళీగానే ఉన్నాయి. మొత్తం 20 కోట్ల 55 లక్షల రూపాయల తో మినీ వేలం ద్వారా తన అవసరాలకు తగిన ఆటగాళ్లను సొంతం చేసుకొనే అవకాశం ముంబై జట్టుకు ఉంది.

వేలానికి కేన్ , మయాంక్, డ్వయన్ బ్రావో

కొచ్చీ వేదికగా వచ్చెనెలలో నిర్వహించే మినీవేలం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, కింగ్స్ పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావోలతో సహా మొత్తం 68 మంది అందుబాటులోకి రానున్నారు.

చెన్నై ఫ్రాంచైజీ కొనసాగించనున్న క్రికెటర్లలో రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, మోయిన్ అలీ, రితురాజ్ గయక్వాడ్, డేవోన్ కాన్వే, శివం దూబే, డ్వైన్ ప్రిటోరిస్, మైకేల్ సాంట్నర్, దీపక్ చహార్, మహేశ్ తీక్షణ, మతీషా పతీరన్ ఉన్నారు.

చెన్నైజట్టులో ఇద్దరు విదేశీ ఆటగాళ్ల బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 20 కోట్ల 45 లక్షల రూపాయలు చెన్నైజట్టుకు వేలం సమయంలో అందుబాటులో ఉన్నాయి.

చెన్నై విడిచిపెట్టిన క్రికెటర్లలో బ్రావో, రాబిన్ ఊతప్ప, ఆడం మిల్నీ, క్రిస్ జోర్డాన్ ఉన్నారు.

హైదరాబాద్ తోనే మర్కరమ్, గ్లెన్ ఫిలిప్స్...

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ...కేన్ విలియమ్స్ సన్, నికోలస్ పూరన్, సుచిత, సీన్ అబ్బోట్, శ్రేయస్ గోపాల్ లను విడిచి పెట్టింది. గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠీ, ఎడెన్ మర్కరమ్, మార్కో జెన్సన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రన్ మాలిక్ లను అట్టిపెట్టుకొంది.

సన్ రైజర్స్ కు 42 కోట్ల 25 లక్షల రూపాయల బడ్జెట్ అందుబాటులో ఉంది. నాలుగు విదేశీ క్రికెటర్ల బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ ..శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, కెఎస్ భరత్, మన్ దీప్ సింగ్ లను కాదనుకొంది. రిషభ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీజట్టు గత సీజన్లో ఆడిన ఎక్కువ మందిని

మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ వెటరన్ అశ్విన్, యజువేంద్ర చహాల్, హెట్ మేయర్, పడిక్కల్, జోస్ బట్లర్, బౌల్ట్, ప్రసిద్ధ కృష్ణ, మెకోయ్, కుల్దీప్ సేన్ లను కొనసాగించనుంది. సంజు శాంసన్ నాయకుడుగా కొనసాగనున్నాడు.

జైపూర్ ఫ్రాంచైజీకి 13 కోట్ల 20 లక్షల రూపాయల బడ్జెట్ మాత్రమే అందుబాటులో ఉంది.

బెంగళూరుకు 8 కోట్ల 75 లక్షల బడ్జెట్..

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అతితక్కువ బడ్జెట్ 8 కోట్ల 75 లక్షల రూపాయలతో వేలం బరిలోకి దిగనుంది. గతసీజన్లో ఆడిన ఆటగాళ్లలో ఎక్కువ మందిని కొనసాగించాలని నిర్ణయించింది.

డూప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు తరపున విరాట్ కొహ్లీ, మాక్స్ వెల్, హసరంగ, షాబాజ్ అహ్మద్ సిరాజ్, హేజిల్ వుట్ క్రీలకపాత్ర పోషించనున్నారు.

రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ గత సీజన్లోని జట్లనే కొనసాగించనున్నాయి.

లక్నో 23 కోట్ల 35 లక్షలు, గుజరాత్ 19 కోట్ల 25 లక్షల రూపాయల బడ్జెట్ తో మినీవేలంలో పాల్గోనున్నాయి.

మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ 7 కోట్ల 5 లక్షల రూపాయల అతితక్కువ బడ్జెట్ తోను, కింగ్స్ పంజాబ్ 32 కోట్ల 20 లక్షల రూపాయల బడ్డెట్ తోను వేలం బరిలో నిలువనున్నాయి.

పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్ ను విడిచి పెట్టి..శిఖర్ ధావన్ కు జట్టు పగ్గాలు అప్పజెప్పింది.డిసెంబర్ 23న కొచ్చీ వేదికగా జరిగే మినీ వేలం ద్వారా వివిధజట్లు తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్ తోనే అవసరాలకు తగిన ఆటగాళ్లను దక్కించుకోనున్నాయి.

Tags:    
Advertisement

Similar News