టీ-20ల్లో చెక్కుచెదరని భారత టాప్ ర్యాంక్!

ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ లోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 2-1తో గెలుచుకోడం ద్వారా భారత్ టాప్ ర్యాంక్ చెక్కుచెదరకుండా నిలిచింది.

Advertisement
Update:2022-09-27 10:07 IST

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో మాజీ చాంపియన్ భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ తన నంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకోగలిగింది...

ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ లోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 2-1తో గెలుచుకోడం ద్వారా భారత్ టాప్ ర్యాంక్ చెక్కుచెదరకుండా నిలిచింది.

దుబాయ్ వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో పాకిస్థాన్, శ్రీలంకజట్ల చేతిలో పరాజయాలు పొందిన భారత్ కు...ఆస్ట్రేలియాతో ముగిసిన టీ-20 సిరీస్ లోని తొలిపోరులోనూ ఓటమి తప్పలేదు.

భారతజట్టు ఆడిన గత ఆరు టీ-20 మ్యాచ్ ల్లో మూడు పరాజయాలు పొందినా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం నిలుపుకోగలిగింది.

268 పాయింట్లతో నంబర్ వన్ భారత్..

దుబాయ్ లో ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.. భారత్‌ 268 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గత వారం వరకూ రెండోర్యాంక్ లో కొనసాగుతూ వచ్చిన పాకిస్థాన్ మూడోర్యాంక్ కు పడిపోయింది. పాక్ తో ఏడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి నాలుగు మ్యాచ్ ల్లోనే రెండు విజయాలు సాధించడం ద్వారా ఇంగ్లండ్ మూడో ర్యాంక్ కు చేరుకోగలిగింది.

ఇంగ్లండ్‌ 261 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య ఏడు పాయింట్ల వ్యత్యాసం ఉండగా.. బుధవారం నుంచి రోహిత్‌ సేన దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ 258 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నాయి.

భారతజట్టులో రెండుమార్పులు...

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు సన్నాహకంగా భారత్ ఆడనున్న ఆఖరి టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో రెండుమార్పులు చేశారు. కరోనా బారిన పడిన ఫాస్ట్ బౌలర్

మహ్మద్ షమీ తిరిగి కోలుకోలేకపోడంతో...అతని స్థానంలో బెంగాల్ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ కు చోటు కల్పించారు. అంతేకాదు...డాషింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు

ప్రస్తుత సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. పాండ్యా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు 15మంది సభ్యులజట్టులో చోటు కల్పించారు.

దక్షిణాఫ్రికాతో రేపు తొలివన్డే...

టీ-20 ఆరవ ర్యాంకర్ దక్షిణాఫ్రికాతో రేపటి నుంచే జరిగే మూడుమ్యాచ్ ల సిరీస్ లో భారత్ పోటీపడనుంది. సిరీస్ లోని తొలివన్డేకి తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులతో పాటు సఫారీ టీమ్ సైతం తిరువనంతపురం చేరుకొని సాధనలో నిమగ్నమయ్యింది.

అక్టోబర్ 2న గౌహతీలోని బార్సపారా స్టేడియం వేదికగా రేండో టీ-20మ్యాచ్, అక్టోబర్ 4న ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా మూడవ, ఆఖరి టీ-20 మ్యాచ్ జరుగుతాయి.

ఆ తరువాత రోహిత్ శర్మ నాయకత్వంలోని 15మంది సభ్యుల భారతజట్టు..ప్రపంచకప్ వేదిక ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది.

Tags:    
Advertisement

Similar News