తొలి టెస్టులో భారత్ ఘన విజయం
పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది.
Advertisement
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది. 534 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్‌లో 238 పరుగులకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ 89, మిచెల్ మార్ష్, అలెక్స్ 41 మినహా అందరూ విఫలమయ్యారు. బుమ్రా 3, సిరాజ్3, సుందర్ 2 వికెట్లు తీశారు. 5 టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో ఉంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 8 వికెట్లకు 487 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆస్ట్రేలియా 238 పరుగులకే కుప్పకూలింది.
Advertisement