27 నుంచి భారత్- విండీస్ వన్డే సిరీస్!

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ కు ఈనెల 27న తెరలేవనుంది. రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 1-0తో నెగ్గిన భారత్..వన్డే సిరీస్ లో సైతం హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

Advertisement
Update:2023-07-25 16:18 IST

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ కు ఈనెల 27న తెరలేవనుంది. రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 1-0తో నెగ్గిన భారత్..వన్డే సిరీస్ లో సైతం హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది...

భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా జరిగిన రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 1-0తో కైవసం చేసుకొంది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ వేదికగా జరిగిన రెండోటెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు ఆట వర్షంతో రద్దు కావడంతో క్లీన్ స్వీప్ విజయం భారత్ చేజారిపోయింది. మొత్తం మీద..

సిరీస్ లోని ఆఖరిటెస్టులో రెండురోజుల ఆట వర్షంతో నష్టపోవాల్సి వచ్చింది.

టెస్టు లీగ్ టేబుల్ రెండోస్థానంలో భారత్...

వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0తో నెగ్గాల్సిన భారత్ ను వరుణదేవుడి రూపంలో దురదృష్టం వెంటాడింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఆఖరిటెస్టు ఆఖరిరోజు ఆట వానదెబ్బతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోడంతో..నెగ్గాల్సిన మ్యాచ్ ను భారత్ డ్రాతో సరిపెట్టుకొని 8 విలువైన పాయింట్లు నష్టపోవాల్సి వచ్చింది.

రెండుమ్యాచ్ ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసి ఉంటే..మొత్తం 24 పాయింట్లు దక్కేవి. అయితే ..వర్షం దెబ్బతో భారత్ కు కేవలం 4 పాయింట్లు మాత్రమే దక్కాయి. మొత్తం 16 పాయింట్లతో భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో విజయశాతం 66. 67కు పరిమితమయ్యింది.

2023-25 ఐసీసీ టెస్టు లీగ్ టోర్నీ తొలి సిరీస్ ముగిసే సమయానికి లీగ్ టేబుల్ పట్టికలో పాకిస్థాన్, భారత్ మొదటి రెండుస్థానాలలో నిలిచాయి. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ లోని తొలిటెస్టు ను నెగ్గడం ద్వారా పాక్ జట్టు టాపర్ గా నిలిచింది.

భారత్ చేతిలో 0-1తో ఓడిన వెస్టిండీస్ జట్టు...రెండోటెస్టు వర్షంతో రద్దు కావడంతో 4 పాయింట్లు దక్కించుకోగలిగింది. 16.67 పాయింట్ల శాతంతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

ప్రస్తుత వెస్టిండీస్ సిరీస్ తర్వాత భారతజట్టు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలలో పర్యటించితో విదేశీ సిరీస్ ల్లో తలపడాల్సి ఉంది. ఆ త‌ర్వాత ఇంగ్లాండ్‌తో స్వంత గ‌డ్డ‌పై జరిగే సిరీస్ లో తలపడనుంది.

టెస్టు సిరీస్ ను ముగించిన ఈరెండుజట్లూ..జులై 27 నుంచి జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో తలపడనున్నాయి. ఈ సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు రోహిత్ శర్మ, వెస్టిండీస్ జట్టుకు షియా హోప్ నాయకత్వం వహించనున్నారు.

భారత్ 3, విండీస్ 10వ ర్యాంక్...

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రెండుసార్లు ప్రపంచ చాంపియన్ జట్లు భారత్ 3, వెస్టిండీస్ 10 ర్యాంకుల్లో ఉన్నాయి. భారత్ వేదికగా అక్టోబర్ లో ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ విఫలమయ్యింది. గత 48 సంవత్సరాల కాలంలో వెస్టిండీస్ లాంటి దిగ్గజజట్టు లేకుండానే వన్డే ప్రపంచకప్ జరుగనుంది.

వెస్టిండీస్ తో జరిగే ఈ తీన్మార్ సిరీస్ ను భారత్ ..ప్రపంచకప్ కు సన్నాహకంగా ఉపయోగించుకొంటోంది. సిరీస్ లోని తొలివన్డే బార్బెడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా

27న జరుగుతుంది. 29న జరిగే రెండోవన్డే కి సైతం కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియమే ఆతిథ్యమిస్తోంది.

ఆగస్టు 1న జరిగే ఆఖరి, మూడో వన్డేను ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా నిర్వహిస్తారు.

వన్డేజట్టులో సంజు శాంసన్, రుతురాజ్

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత వన్డే జట్టులో శుభ్ మన్ గిల్, రితురాజ్ గయక్వాడ్, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్ ), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్ ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News