మిచెల్ స్టార్క్ దెబ్బకు భారత్ 180 రన్స్‌కు ఆలౌట్
పింక్ బాల్ టెస్టులో టాప్ స్కోరర్ నితీశ్
ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 180 రన్స్‌కు ఆలౌటైంది. నితీశ్‌కుమార్‌రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/48) దెబ్బకు భారత్ టాప్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. అతనితోపాటు కమిన్స్ 2, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు పడగొట్టారు. భారత బ్యాటర్లతో కేఎల్ రాహుల్ 37, శుభ్‌మన్ గిల్ 31, అశ్విన్ 22, రిషభ్ పంత్ 21 రన్స్ చేశారు. యశస్వి, హర్షిత్, బుమ్రా డకౌట్ కాగా.. విరాట్ కోహ్లీ 7, కెప్టెన్ రోహిత్ శర్మ 3 రన్స్‌తో నిరాశపరిచారు. సిరాజ్ 4 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
టీ బ్రేక్ సమయానికి భారత్ 82/4
ఫస్ట్ బాల్‌కే టీమిండియాకు షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యవస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. బాల్ స్లోగా వస్తున్నదంటూ మిచెల్ స్టార్క్‌ను యశస్వి ఆట పట్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని బౌలింగ్‌లోనే మొదటి బాల్‌కే ఎల్బీగా వెనుదిరిగాడు. మరోవైపు కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) క్రీజ్‌లో పాతుకుపోయి రెండో వికెట్కు 69 రన్స్ జోడించారు. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. వీరిద్దరూ దూకుడుగా మొదలుపెట్టడంతో రన్స్ ఈజీగానే వచ్చాయి. మిచెల్ స్టార్క్ మరోసారి బౌలింగ్ స్పెల్‌కు వచ్చి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. మొదట కేఎల్ను ఔట్ చసిన స్టార్క్ తన తర్వాత ఓవర్‌లోనే విరాట్ (7) బుట్టలో వేశాడు. వీరిద్దరూ బయటకు వెళ్తున్న బాల్స్‌ను వెంటాడి మరి స్లిప్‌లో క్యాచ్‌లు ఇవ్వడం గమనార్హం. వచ్చినప్పటి నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడిన గిల్ కూడా బోలాండ్ వేసిన బాల్‌కు ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో నాలుగు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లను టీమిండియా కోల్పోయింది.